బుల్లితెరపై హాట్ యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్ లకు పోటీ ఇవ్వడానికి శ్రీముఖి రెడీ అవడమే కాదు.. ఇప్పటికే రష్మీకి చెక్ పెట్టేసిందనే టాక్ నడుస్తుండగా తాజాగా మరో హాట్ యాంకర్ కూడా తయారైంది. కాస్త తింగరి తనంగా కనబడుతూ గ్లామర్ షో చేసే వర్షిణి ఈటివి షోస్ తో బాగా పాపులర్ అవ్వడమే కాదు.. ఢీ షో తో బాగా ఫేమస్ అయ్యింది. పటాస్ నుండి ఢీ షో లో చక్రం తిప్పుతున్న వర్షిణి హాట్ గాను, డాన్స్ లోను అందరిని పడెయ్యడమే కాదు.... అటు సుధీర్ తోనూ ఇటు హైపర్ ఆదితోను కామెడీ చేస్తుంది. అయితే ఆది కి వర్షిణికి మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ వస్తున్నా వార్తలకు వర్షిణి తాజాగా సమాధానం ఇచ్చింది.
వర్షిణి సోషల్ మీడియాలో అభిమానులల్తో లైవ్ చాట్ లోకి రాగా.. వర్షిణి, సుధీర్ పై మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా.. సుధీర్ నా కుటుంబ సభ్యుడు అని చెప్పింది. ఆది మీరు ప్రేమలో ఉన్నారా అనే ప్రశ్నకు ఏమో తెలియదు కానీ.. ఆది నాకు మంచి స్నేహితుడు అంటూ క్లారిటీ లేని సమాధానం ఇచ్చింది. సుధీర్ ఫ్యామిలీ మ్యాన్, హైపర్ ఆది తో ప్రేమ లాంటిది ఉందో... లేదో... అంటూ.. తన డ్రెస్సింగ్ స్టయిల్ పై మాట్లాడిన నెటిజన్ల మొహం వాచేలా సమాధానం కూడా ఇచ్చింది. మీ డ్రెస్సింగ్ స్టయిల్ మార్చమనగానే,.. నేను చాలా స్టయిల్స్ ఫాలో అయ్యా.. మీదగ్గర ఇంకేమన్నా కొత్త స్టయిల్ ఉంటే చెప్పు ఫాలో అవుతా అంటూ సమాధానం చెప్పింది.