Advertisementt

కరోనా సాంగ్: ప్రకృతికి ప్రణామం

Wed 22nd Apr 2020 02:32 PM
song on corona,prakruthiki pranaamam,dr josyabhatla,corona  కరోనా సాంగ్: ప్రకృతికి ప్రణామం
Prakruthiki Pranaamam Special Song on CORONA from Music Dr. Josyabhatla కరోనా సాంగ్: ప్రకృతికి ప్రణామం
Advertisement
Ads by CJ

నాందీ వాచకం:

మాఱే ప్రకృతి కనుగుణంగా మెలిగే జీవం మనగలదు. తాను మాఱక తన చుట్టూ మార్చే జీవం మనిషొక్కడే!

అంతకంతకు అవసరాలను పెంచుకుంటూ – సుఖం మరిగి – అదుపు తప్పిన ఆశపోతుకు అహంకారమె తోడుగా

ప్రకృతిలోని వనరులన్నీ – సొంత ఆస్తుల తీరుగా – నిరంకుశుడై కొల్లగొట్టి, దుబారాగా ఖర్చు పెట్టి

ఱేపటి తరం హక్కులు కాలరాసిన ద్రోహి – మనిషని – ఆ మనిషి వైపే చూసి ప్రకృతి ఆత్మరక్షణ లక్ష్యమై...

సాకీ:

ఊపిరయినా ఆడనీయని సూక్ష్మజీవికి ప్రాణమిచ్చి

ఇంటి గడపను దాటనీయని ఆంక్ష మనకే తను విధించి

మనిషి చేసిన మలినమంతా కడిగిపాఱేస్తోంది నేడు – పుడమి తల్లిని చూడు చూడు!

 

పల్లవి:

తీరు తెలియని, దారి మఱిచిన పఱుగు నుంచి స్వేచ్ఛని

మనకు ఇచ్చిందెవరయా – ఇది కొరోనా వైరస్ దయ!

అనుపల్లవి:

ప్రకృతిలో ఈ వికృత విలయం మనిషి తప్పుల ఫలితమే!

ఇప్పుడైనా మాఱకుంటే మనిషి జాతికి అంతమే!

 

చరణం 1:

తల్లి గుండెను చీల్చినాం, తవ్వి కొండలు కూల్చినాం! నీటిలోతుల లోన – చమురు బావులు వెదికినాం!

పొలాలన్నీ ప్లాట్లు చేసి చెఱువులెన్నో పూడ్చివేసి... తిండి పంటలు పెంచగా – అంతరిక్షం దున్నినాం! ॥ ప్రకృతిలో ॥

 

చరణం 2:

అగ్రరాజ్యం అన్న పేరుకు పాకులాడే పోరులో – ఉచ్ఛనీచం మఱచిపోయి... ఇచ్ఛ రీతిగ నడచినాము!

తినే తిండికి జన్యుమార్పులు మహామేధకు ఆనవాలుగ – గాలి, నీరు, నేల చెఱిచి... కల్మషంగా మిగిలినాము! ॥ ప్రకృతిలో ॥

 

చరణం 3:

పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పే ప్రకృతి పాఠం దెబ్బకి... పేదవాళ్ళే నలిగి - విలవిలల్లో మిగిలినారు!

శిక్ష వేసే తీరులోన తల్లిగా గమనించవమ్మా! తప్పుచేయని వాళ్ళ పై... కన్నులెఱ్ఱ జేయకమ్మా! ॥ ప్రకృతిలో ॥

Click Here for Song

Prakruthiki Pranaamam Special Song on CORONA from Music Dr. Josyabhatla:

Song on CORONA: Prakruthiki Pranaamam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ