Advertisementt

ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక ఏం చెప్పిందంటే..

Thu 23rd Apr 2020 06:55 PM
niharika konidela,marriage,mega family,young rebel star prabhas,prabhas and niharika  ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక ఏం చెప్పిందంటే..
Niharika Konidela Reacts Marriage With Young Rebel star Prabhas ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక ఏం చెప్పిందంటే..
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ లాగా చాలా మంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా వరకూ సక్సెస్ అయ్యారు.. ఇంకా కొందరు అవుతున్నారు. అయితే ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక కొణిదెల మాత్రం అస్సలు హిట్టవ్వట్లేదు.. చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాపే.. ఒక్కటంటే ఒక్కటి సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు అవకాశాలివ్వాలన్నా దర్శకనిర్మాతలు ఎవరూ పెద్దగా సాహసించట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా హీరోలకు మాత్రం అచ్చొచ్చిన టాలీవుడ్.. మెగా డాటర్‌కు అచ్చిరాలేదన్న అప్పట్లో పెద్ద ఎత్తునే వార్తలు వచ్చాయి. 

త్వరలోనే.. నిహారికకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారని గుసగుసలు వినిపించాయి. ఈ తరుణంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సాయిధరమ్ తేజ్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. కొన్ని వెబ్ సైట్లు అయితే ప్రభాస్‌తోనే పెళ్లి అని పుంకాలు పుంకాలుగా కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ప్రభాస్ పెద్దమ్మతో పాటు పలువురు స్పందించినప్పటికీ.. మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పెళ్లిపై స్వయంగా నిహారికే పెదవి విప్పింది

నిజంగానే ప్రభాస్‌ను ప్రేమించారా..? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు..? అని ఓ మెగాభిమాని నుంచి లైవ్‌లో ప్రశ్న ఎదురైంది. ‘ప్రభాస్‌తో నా పెళ్లా..? అయినా ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం ఏంటి..? ఆయనెక్కడ..? నేనెక్కడ. అవన్నీ పుకార్లే ఎవరూ పట్టించుకోకండి. ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో..? ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్‌తో పెళ్లి అంటూ కూడా రూమర్స్ వచ్చాయి. దయచేసి ఎవరూ నమ్మకండి’ అని నిహారిక చెప్పుకొచ్చింది. 

 

Niharika Konidela Reacts Marriage With Young Rebel star Prabhas:

Niharika Konidela Reacts Marriage With Young Rebel star Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ