Advertisementt

పూరి.. ‘ఫైటర్’పై కరోనా ఎఫెక్ట్

Sun 26th Apr 2020 10:40 AM
puri jagannadh,fighter,corona,effect,mumbai,shooting,charmee  పూరి.. ‘ఫైటర్’పై కరోనా ఎఫెక్ట్
Corona Effect on Puri Fighter Movie పూరి.. ‘ఫైటర్’పై కరోనా ఎఫెక్ట్
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా ఫిలిం ‘ఫైటర్’ చేస్తున్నాడు. ఫైటర్ సినిమాని పాన్ ఇండియా ఫిలింగా మార్చాక ఆ సినిమా చెయ్యడానికి ముంబై మకాం మార్చాడు. ముంబై లోనే ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని పూరి ఛార్మీలు ఇద్దరు విజయ్ దేవరకొండ తో సినిమాని 40 శాతం పూర్తి చేసారు. ముంబై పరిసర ప్రాంతాల్లో చాలావరకు షూటింగ్ చేసిన పూరి.. మిగతా షూటింగ్ కూడా ముంబై పరిసరాల్లోనే ఉండబోతుందట. అందుకే పూరి ప్రత్యేకంగా అక్కడ ఆఫీస్ తెరిచింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై వెళ్లి షూటింగ్ చెయ్యడం అనేది జరిగేలా కనిపించడం లేదు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యంగా ముంబై లోని ధారవిలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. ధారవిలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దానితో అన్నిచోట్లా లాక్ డౌన్ ఎత్తేసినా.. అక్కడ మాత్రం చాలారోజులు కొనసాగించేలా కనబడుతుంది వ్యవహారం. అక్కడ షూటింగ్ జరపడానికి అప్పుడే అనుమతి లభించడం అనేది కష్టం. మరి ఫైటర్ కథ మొత్తం ముంబై తోనే ముడిపడి ఉంది. దానితో పూరి - విజయ్ ఈ సినిమా షూటింగ్ విషయంలో టెన్షన్ పడుతున్నారట. ఈ విషయమై పూరి తెగ ఆలోచిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. 

Corona Effect on Puri Fighter Movie:

Tension in Puri and Vijay deverakonda about Fighter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ