Advertisementt

సంక్రాంతి రేసులోకి వెళుతున్న ‘వకీల్ సాబ్’

Sun 26th Apr 2020 11:53 AM
pawan kalyan,vakeel saab,sankranthi race,corona effect  సంక్రాంతి రేసులోకి వెళుతున్న ‘వకీల్ సాబ్’
Again Pawan Vakeel Saab Postponed సంక్రాంతి రేసులోకి వెళుతున్న ‘వకీల్ సాబ్’
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు. అనుకున్న వెంటనే హిందీ మూవీ పింక్ ని రీమేక్ చేయాలనీ డిసైడయ్యి.. ఏమాత్రం లేట్ చేయకుండా షూటింగ్ కూడా గ్యాప్ లేకుండా స్టార్ట్ చేసారు. షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసుకుని సమ్మర్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ కూడా చేసుకున్నారు మేకర్స్. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో సినిమా విడుదల దసరాకి వెళుతుందని భావించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ సినిమా దసరాకు కూడా కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఇప్పటిలో తగ్గేలా లేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి రెండు మూడు నెలలు పడుతుంది కనుక సినిమాను సంక్రాంతి రేస్ లో దింపాలని డిసైడ్ అయ్యారు. పైగా థియేటర్స్ కూడా డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయి కనుక...సంక్రాంతి లోపు షూటింగ్ మొత్తం చేసుకుని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

సంక్రాంతి కి రిలీజ్ అంటే అప్పటికి పవన్ సినిమా విడుదల అయి మూడేళ్లు అవుతుంది కనుక ఆ క్రేజ్ కూడా తోడవుతుంది. సో మేకర్స్ కూడా అప్పుడైతే బాగుంటుందని అనుకుంటున్నారు. వకీల్ సాబ్ రిలీజ్ తరువాతే తన మిగతా సినిమాల కాల్ షీట్స్ గురించి ఆలోచిస్తా అంటున్నాడట పవన్. మరి సంక్రాంతికి ఆల్రెడీ RRR వస్తుంది. మరి దానికి పోటీగా వకీల్ సాబ్ రిలీజ్ చేస్తారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

Again Pawan Vakeel Saab Postponed:

Pawan Kalyan Vakeel Saab in Sankranthi Race 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ