పెళ్లి తరువాత కూడా వరస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న సమంతను పొగడ్తలతో మోసేసింది తన స్నేహితురాలు తమన్నా. ఈనెల 28న సామ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు తన ఫ్యాన్స్ అందరు కామన్ డీపీగా దీన్ని పెట్టుకోవాలని ట్విట్టర్ ద్వారా డీపీని రిలీజ్ చేసింది తమన్నా. ఈ సందర్భంగా తమన్నా ట్వీట్ చేస్తూ...
‘‘సామ్ తన కెరీర్‌ని మలుచుకున్న తీరు చాలామందికి ఆదర్శం. బ్యూటీ విత్ బ్రెయిన్, సూపర్ స్టైలిష్, ఎంతో ఏకాగ్రత, నైపుణ్యం ఉన్న నటి. ఆమె నాకు పరిచయం అవ్వడం చాలా అదృష్టం’’ అన్న తమన్నా ట్వీట్ కు రిప్లయ్ ఇస్తూ సామ్... ‘‘థాంక్స్, నువ్వు నా డార్లింగ్ వి. నా గురించి దయతో మాట్లాడావ్...లవ్ యు బేబీ’’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. ఇది చూసి చాలామంది ఏంటి వీరిద్దరూ ఇంతమంచి ఫ్రెండ్సా అని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సామ్ ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇది త్వరలో రిలీజ్ కానుంది.