Advertisementt

ఆ క్రికెటర్ తెలుగు సినిమాలని చూస్తున్నాడు..

Tue 28th Apr 2020 04:47 PM
ashwin,crikcket,lockdown celebrities,bheeshma,telugu,tollywood  ఆ క్రికెటర్ తెలుగు సినిమాలని చూస్తున్నాడు..
Indian cricketer watching Telugu movies.. ఆ క్రికెటర్ తెలుగు సినిమాలని చూస్తున్నాడు..
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా అందరూ ఇళ్ళకే పరిమితమైన నేపథ్యంలో సినిమాలు చూడడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి టీవీ వీక్షణం బాగా పెరిగిందని సర్వేలో వెల్లడైంది. ఇంట్లో ఉండిపోవడంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లకి గిరాకీ బాగా పెరిగింది. తెలుగు, తమిళం అని కాకుండా ప్రపంచ భాషల్లో తమకి నచ్చిన సినిమాలని చూస్తున్నారు.

అయితే ఈ లాక్డౌన్ సమయంలో భారత క్రికెటర్ అశ్విన్  తెలుగు సినిమాలని చూస్తున్నాడట. తన సహచర ఆటగాడు హనుమ విహారితో వీడియో కాన్ఫరెన్స్ లో తెలుగు సినిమాల గురించి మాట్లాడాడు. ఈ మధ్య తెలుగు సినిమాలే ఎక్కువగా చూస్తున్నానని...ఇప్పట్లో రిలీజైన బెస్ట్ సినిమా ఏంటని అడగడంతో, హనుమ విహారి సమాధానమిస్తూ.. భీష్మ సినిమా చాలా బాగుందని. నితిన్ హీరోగా నటించాడని.. ఒకసారి చూడమని కోరాడు. అయితే ఈ లాక్డౌన్ సమయంలో క్రికెటర్ అశ్విన్ తెలుగు సినిమాలు చూస్తూ, తెలుగు సినిమాలకి అభిమానిగా మారిపోయాడట.

Indian cricketer watching Telugu movies..:

Indian Cricketer Ashwin Watching Telugu Movies..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ