Advertisementt

‘మహా సముద్రం’లో సిద్ధార్థ్.. కండిషన్స్ అప్లై!

Wed 29th Apr 2020 12:35 AM
siddharth,maha samudram,ajay bhupathi,sharwanand  ‘మహా సముద్రం’లో సిద్ధార్థ్.. కండిషన్స్ అప్లై!
Siddharth in Maha Samudram.. conditions apply! ‘మహా సముద్రం’లో సిద్ధార్థ్.. కండిషన్స్ అప్లై!
Advertisement
Ads by CJ

‘ఆర్ఎక్స్ 100’ లాంటి బుల్లెట్ సినిమాను గురి తప్పకుండా షూట్ చేసి.. టాలీవుడ్‌లో సింగిల్ సినిమాతో తన సత్తా చాటి చూపించిన దర్శకుడు అజయ్ భూపతి. తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది..? ఏ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నారు..? అసలు ఆయన సినిమాలో హీరో ఎవరు..? హీరోయిన్ ఎవరు..? ఈ సినిమాకు ఎవరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..? అనేవి గత కొన్ని రోజులుగా వస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఒకరిద్దరు హీరోలకు కథ చెప్పడం వాళ్లు నాన్చడంతో ఈయన మళ్లీ వెతుకులాట మొదలెట్టడం అలా అటు తిరిగి.. ఇటు తిరిగి ఫైనల్‌గా యంగ్ శర్వానందే కరెక్ట్ అని ‘మ‌హా స‌ముద్రం’ ఇక్కడికొచ్చి ఆగింది. తాజాగా ఇందుకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.

కండిషన్స్ అప్లై..!

అదేమిటంటే.. ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడట. అంటే మల్టీస్టారర్ సినిమా అన్న మాట. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని.. ఇందుకు తగ్గట్టుగానే శర్వానంద్‌తో పాటు లవర్ బాయ్‌గా అప్పట్లో వరుస హిట్లు కొట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్‌ను కూడా తీసుకుంటున్నారట. ఇటీవలే సిద్ధార్థ్‌ను సంప్రదించి పాత్ర గురించి చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వాస్తవానికి గత కొన్నేళ్లుగా సిద్ధార్థ్‌కు అటు తమిళ్, ఇటు తెలుగులో హిట్ పడలేదు. మంచి కథ దొరికితే టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ‘మ‌హా స‌ముద్రం’ స్క్రిప్ట్ చెప్పగానే ఓకే చెప్పాడట. అయితే ఇద్దరు హీరోలు అంటున్నారు గనుక ఇద్దరి పాత్రలు మంచిగానే ఉండాలని.. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అనే ఫీలింగ్ రాకూడదని తన కండిషన్స్‌ను దర్శకనిర్మాతలకు చెప్పాడట సిద్ధార్థ్.

సిద్ధార్థ్‌కు ఎవరో..!

కాగా.. ఇప్పటికే శర్వా సరసన సాయి పల్లవిని తీసుకున్నారు. సిద్ధార్థ్‌కు కూడా హీరోయిన్ కావాల్సిందే.. ఈయనకు తెలుగు బ్యూటీనే సరిపెట్టుకుంటారా..? లేకుంటే తమిళ బ్యూటీని పట్టుకొస్తారా అనేది తెలియట్లేదు. అయితే సీనియర్ హీరోయిన్.. ఒకప్పుడు సిద్ధార్థ్‌ సరసన నటించిన త్రిష పేరు తెరపైకి వచ్చింది. సిద్ధార్థ్ ఒప్పుకున్నాడని కానీ.. ఇది మల్టీస్టారర్ మూవీ అని గానీ ఇంతవరకూ దర్శకనిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై స్పష్టత రావాలంటే లాక్ డౌన్ ముగిసేవరకూ వేచి చూడాల్సిందే మరి.

Siddharth in Maha Samudram.. conditions apply!:

Siddharth in Maha Samudram.. conditions apply!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ