విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు, నితిన్ తో ఒక్క సినిమా చేసిన రష్మిక మందన్న కి మీకు విజయ్ అంటే ఇష్టమా? నితిన్ అంటే ఇష్టమా? అని అడిగితే.. మీకు ఎవరంటే ఇష్టమో ముందు అది చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ క్వారంటైన్ గడుపుతున్న రష్మిక సరదాగా... సోషల్ మీడియా లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది. లాక్ డౌన్ ముగియగానే తాను చేసే మొదటి పని.. వెంటనే వెళ్లి ఫ్రెండ్స్ ని కలవడం అని..ఖాళీ సమయంలో కేకులు, వంటలు తయారు చేస్తుంటా అని చెబుతుంది.
ఇక మీకు హిందీ మాట్లాడడం వచ్చా.. అని అడిగితే.. వారికీ హిందీలో సమాధానం చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఇక రష్మిక పుష్ప కోసం పాన్ ఇండియా హీరోయిన్ గా మారడంతో ఆమెపై మరింత క్రేజ్ పెరిగింది. అయితే పుష్ప కోసం మీరు విభిన్న యాస నేర్చుకుంటున్నారా అని అడిగితే....అది మీకెలా తెలుసు అంటూ నవ్వేసింది. ఇక హిందీలో నటిస్తారా అని అడుగగా... ఆలోచిస్తా అని... తమిళ సినిమా ఏమన్నా చేసారా.. అని అడిగితె.. నటించాను.. కానీ లాక్ డౌన్ ముగిసాక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని చెప్పడమే కాదు... నటి కాకపోయి ఉంటే... అనగా జీవితాంతం క్వారంటైన్‌లో ఉండేదాన్ని అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది.