Advertisementt

చమ్మక్ చంద్ర మంచోడే.. కానీ: సత్తిపండు

Fri 01st May 2020 08:12 AM
sattipandu,sensational comments,chammak chandra,jabardasth,adirindi,nagababu  చమ్మక్ చంద్ర మంచోడే.. కానీ: సత్తిపండు
Sattipandu talks about Chammak Chandra Greatness చమ్మక్ చంద్ర మంచోడే.. కానీ: సత్తిపండు
Advertisement
Ads by CJ

జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర ఎంత ఫేమస్సో అందరికి తెలుసు. ఫ్యామిలీ స్కిట్స్ తోనే చంద్ర విపరీతంగా పాపులర్ అయ్యాడు. సత్తిపండు, వినోదిని తో కలిసి చమ్మక్ చంద్ర సక్సెస్ ఫుల్ గా స్కిట్స్ కొట్టాడు. అయితే ఉన్నంట్లుండి.. చమ్మక్ చంద్ర నాగబాబు కూడా జబర్దస్త్ ని వదిలేసి అదిరింది షోకి వెళ్ళిపోయాడు. జబర్దస్త్ వల్ల ఫేమ్ వచ్చింది అని.. కానీ నాగబాబు గారికిచ్చిన మాట వలనే జబర్దస్త్ వదిలేసినట్టుగా చెప్పాడు. తాజాగా ఈ విషయమై చమ్మక్ చంద్ర టీమ్ మేట్ సత్తిపండు స్పందించాడు.

చంద్ర ‘అదిరింది’కి వెళ్ళిపోయినా... సత్తిపండు మాత్రం జబర్దస్‌ని వదల్లేదు. అయితే చమ్మక్ చంద్రపై బయట స్వాతి నాయుడు అనే అమ్మాయి చాలా ఆరోపణలే చేసింది. చంద్ర అమ్మాయిలను వాడుకుని వదిలేసే రకమంటూ రెచ్చిపోయి.. చంద్ర పై అరోపణలు చేసింది. అయితే సత్తిపండు మాత్రం చంద్ర చాలా మంచోడని, చంద్ర ఎవరిని మోసం చేసే వ్యక్తి కాదని, చమ్మక్ చంద్రని చాలా తక్కువగా అంచనా వేస్తారు. కానీ ఆయన చాలా మంచోడు. అంత మంచి అతన్ని తానెక్కడా చూడలేదని.. అంత మంచోడు జబర్దస్త్ ని ఎందుకు వదిలేసాడో.. అసలు జబర్దస్త్ ని చంద్ర వదిలేస్తాడని అనుకోలేదని.. అది చంద్ర సొంత నిర్ణయమని చెప్పాడు. 

Sattipandu talks about Chammak Chandra Greatness :

Sattipandu sensational comments on Chammak Chandra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ