చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించగా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయింది. ఈ సినిమాలో పాయల్, కార్తికేయ మధ్యలో కొన్ని బోల్డ్ సీన్లు ఉండడంతో యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. అయితే కథ కూడా దానికి అనుగుణంగా ఉండడంతో సినిమా విజయం సాధించింది.
ఆర్ ఎక్స్ 100 హిట్ అయిన తర్వాత అజయ్ భూపతి తన రెండవ చిత్రాన్ని శర్వానంద్ తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాని ముందుగా రవితేజతో చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో రవితేజ ఈ సినిమా నుండి తప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత ఈ కథ నాగచైతన్య వద్దకి వెళ్ళింది. అక్కడ డేట్ల సమస్య తలెత్తడంతో చివరికి శర్వానంద్ వద్దకి వచ్చి ఆగింది. అయితే ఈ సినిమాలొ శర్వానంద్ తో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ కూడా కనిపించనున్నాడట.
ఇద్దరు హీరోలు ఉండడం వల్లే ఈ సినిమా తెరకెక్కడం ఆలస్యం అవుతుందని అజయ్ భూపతి అభిప్రాయపడుతున్నాడట. ఇద్దరు హీరోలని ఒప్పించడానికే ఎక్కువ టైమ్ తీసుకోవడంతో మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి కథలు రాయకూడదని అనుకుంటున్నాడట. సోలో హీరోగా ఉండే కథల్నే తీస్తానని, మల్టీస్టారర్ కథల జోలికి వెళ్లనని చెబుతున్నాడు.