Advertisementt

క్యాన్సర్ హాస్పిటల్‌ను పరిశీలించిన బాలయ్య

Sat 02nd May 2020 03:28 AM
nandamuri balakrishna,visits,basavatarakam,indo american,cancer hospital  క్యాన్సర్ హాస్పిటల్‌ను పరిశీలించిన బాలయ్య
Nandamuri Balakrishna Visits Cancer Hospital క్యాన్సర్ హాస్పిటల్‌ను పరిశీలించిన బాలయ్య
Advertisement
Ads by CJ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు చర్యలను నందమూరి బాలకృష్ణ నేడు పరిశీలించారు. ముఖ్యంగా హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లను భవనంలోనికి ప్రవేశించడానికి ముందుగా స్క్రీనింగ్ చేయడానికి చేసిన బృందాలను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం హాస్పిటల్ లోనికి ప్రవేశించే వారికోసం ఏర్పాటు చేసిన శానిటైజేషన్ సౌకర్యాలు అటు పిమ్మట సిబ్బంది తీసుకొంటున్న చర్యలను వాకబు చేశారు. అలానే పేషెంట్ తో పాటు వచ్చిన వారు వేచి ఉండడానికి చేసిన ఏర్పాట్లపై చర్చించారు. పలువురు పేషెంట్లను పరామర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.  

ఇలా రెండు గంటలకు పైగా హాస్పిటల్ లోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించిన అనంతరం లాక్ డౌన్ సమయంలోనూ అటు పిమ్మట తీసుకోవాల్సిన చర్యలపై హాస్పిటల్ లోని కీలక అధికారులు, వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై తగిన సూచనలు చేశారు. ఈ సమావశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ CEO డా. ఆర్ వి ప్రభాకర రావు మరియు మెడికల్ డైరెక్టర్ డా. టి యస్ రావులు కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు జాగ్రత్తలను వివరించారు. 

అనంతరం హాస్పిటల్ లో పని చేస్తున్న షుమారు 400 వందలకు పైగా హౌస్ కీపింగ్ సిబ్బందికి సంస్థ తరపున నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో నందమూరి బాలకృష్ణతో పాటు డా. ఆర్ వి  ప్రభాకర రావు, CEO, BIACH&RI;  డా. టి యస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI;  జి రవి కుమార్, COO, BIACH&RI;  డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Nandamuri Balakrishna Visits Cancer Hospital:

Nandamuri Balakrishna Distributed Commodities At Basavatarakam Indo American Cancer Hospital

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ