Advertisementt

‘రౌడీస్’పై క్లారిటీ ఇచ్చిన విజయ్..!

Sun 03rd May 2020 11:32 PM
vijay deverakonda,rowdies,rowdy star,bollywood media,interview  ‘రౌడీస్’పై క్లారిటీ ఇచ్చిన విజయ్..!
Vijay deverakonda clarity about rowdies ‘రౌడీస్’పై క్లారిటీ ఇచ్చిన విజయ్..!
Advertisement
Ads by CJ

అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయిన విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‌ని రౌడీస్ అని ఎందుకు పిలుస్తాడో ఓ ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నన్ను ప్రేమించే వాళ్లని ఫ్యాన్స్ అని పిలవడం తనకు అసౌకర్యంగా ఉంటుందని...అందులోనూ నన్ను ఇష్టపడేవాళ్లంతా తన వయసు వాళ్లే కావడంతో అందుకే వారిని ‘మై రౌడీ బాయ్స్, మై రౌడీ గర్ల్స్’ అని పిలుస్తుంటానని చెప్పాడు.

మన జీవితంలో చాలా మంది మనల్ని నియంత్రించాలని చూస్తుంటారని...ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇలానే ఉండాలి, అలానే ఉండాలని అంటుంటారు. కానీ మనం మన మనసుకు నచ్చినట్టు ఉండాలని...అందరిని అలానే ఉండాలని కోరుకుంటానని...ఇతరులను నొప్పించకూడదని, హాని చేయకూడదని స్వేచ్ఛగా జీవించాలని..నాలోని ఆ గుణమే ఈరోజు నన్ను ఈ స్థాయిలో ఉంచిందని అందుకే నేను రౌడీ లా ముందుకు వెళ్లాలని నా రౌడీస్ ని కోరుకుంటుంటానని అలా ఆ పదం వచ్చిందని చెప్పాడు విజయ్. అలానే సోషల్ మీడియాలో మీరు ఎవరిని ఎందుకు ఫాలో అవ్వరు అని అడిగిన ప్రశ్నకు.. ‘‘నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని చూసుకోవడానికి ఒక స్పెషల్ టీం ఉంది. ఏదన్నా ఇంపార్టెంట్ అయితే వాళ్ళు నాకు దాన్ని వాట్సప్ ద్వారా పంపితే దానికి నేను రిప్లయ్ ఇస్తుంటా. నాకు సోషల్ మీడియా వాడడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అది అనవసరం అయినా పనికింద నేను భావిస్తాను. అందుకే నేను దానికి దూరంగా ఉంటాను’’ అని చెప్పాడు విజయ్.

Vijay deverakonda clarity about rowdies :

Vijay deverakonda special interview with bollywood media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ