Advertisementt

హెబ్బా పటేల్ కి మళ్ళీ అలాంటి పాత్రే దక్కిందా..?

Sun 03rd May 2020 04:37 PM
hebbah patel,raj tharun,rahul ravindran,netflix,aha  హెబ్బా పటేల్ కి మళ్ళీ అలాంటి పాత్రే దక్కిందా..?
Hebbah gt a bold character in web series..? హెబ్బా పటేల్ కి మళ్ళీ అలాంటి పాత్రే దక్కిందా..?
Advertisement
Ads by CJ

అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన అలా ఎలా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్, ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాతో బాగా పాపులర్ అయింది. ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కనిపించడంతో యూత్ లో బాగా క్రేజ్ సంపాదిందుకుంది. అయితే ఆ చిత్రం తర్వాత ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రమేదీ రాలేదు.

చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి. దాంతో ఐటెం సాంగ్స్ కి రెడీ అయ్యింది హెబ్బా. రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమాలో ఒకానొక పాటలో రామ్ తో కలిసి స్టెప్పులేసింది. హీరోయిన్ గా అవకాశం రాకపోవడంతో చిన్న చితకా పాత్రలు కూడా ఒప్పుకుంది. నితిన్ హీరోగా నటించిన భీష్మ చిత్రంలో ఆమెని చూసిన వారందరూ షాకయ్యారు. అయితే సినిమాల్లో అవకాశాలు లేకపోయినా వెబ్ సిరీసుల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయి.

ఆహా యాప్ లోని మస్తీస్ అనే వెబ్ సిరీస్ లో నటించిన హెబ్బా, అదే యాప్ కోసం మరో రెండు వెబ్ సిరీసుల్లో నటిస్తుందని సమాచారం. అంతేకాక నెట్ ఫ్లిక్స్ కోసం మరో వెబ్ సిరీస్ లోనూ నటించనుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఆమె పాత్ర బోల్డ్ గా ఉంటుందట. మరి ఈ వెబ్ సిరీస్ లైనా సినిమాల్లో అవకాశాలు తెప్పిస్తాయేమో చూడాలి.

Hebbah gt a bold character in web series..?:

Hebbah Got a bold character in web series

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ