Advertisementt

అలుపెరగని సైనికుడిలా సాయమందిస్తున్న నిర్మాత

Wed 06th May 2020 04:11 PM
prasanth goud,donate,food packets,biscuits,water bottles,poor people  అలుపెరగని సైనికుడిలా సాయమందిస్తున్న నిర్మాత
Prasanth Goud Helps Poor People అలుపెరగని సైనికుడిలా సాయమందిస్తున్న నిర్మాత
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి దెబ్బకు ఆకలి బాధలతో ఇబ్బంది పడుతున్న సినీ కళాకారులకు పేదలకు, పట్టు వదలకుండా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సార్ధక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్ మార్చి 24 నుండి నేటి వరకు  సాయమందిస్తూనే వున్నారు. ప్రముఖ స్వచ్చంద సేవా సంస్థ నారిసేన అధినేత్రి లతా చౌదరి సోజన్యంతో  ఇప్పటివరకు  2000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రతిరోజు ఓ బాధ్యతగా  భావించి 575 మంది నిరుపేదలకు ఫుడ్ ప్యాకెట్స్ పంచుతున్నారు. అలాగే పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, డైలీ వేజ్ వర్కర్లు సుమారు 6000 మందికి  ప్రతిరోజు  బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. 

ఆ క్రమంలోనే నిన్న(మంగళవారం)  పేద సినీ కళాకారులకు, వాచ్ మెన్లకు, హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ, ఇందిరా నగరాలలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ప్రశాంత్ గౌడ్. ఇలా ప్రతిరోజు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ పేదల ఆకలి తీరుస్తున్న ప్రశాంత్ గౌడ్ మరికొందరికి ఆదర్శం  కావాలని ఆశిద్దాం.

Prasanth Goud Helps Poor People:

Prasanth Goud Donates food Packets, biscuits and water bottles to poor people 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ