దేశంలోనే మొట్టమొదటి సారిగా కరోనా లాక్ డౌన్ సమయంలో తెరకెక్కిన ‘ది డైరెక్టర్’ సినిమా పోస్టర్, టీజర్ విడుదల!!!
అమితాబ్ బచ్చన్ సినిమా సర్కార్ 3, ఆఫీసర్ మరియు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ వంటి సంచలన సినిమాల రచయిత పి. జయకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘ది డైరెక్టర్’ మూవీ పోస్టర్, టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తన చిత్రం ది డైరెక్టర్ తరఫున సినీపరిశ్రమకి దర్శకత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, కరోనా సమయంలో చిత్ర నిర్మాణానికి సహకరించిన టీం మెంబర్స్ అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు సినిమా దర్శకుడు పి జయకుమార్.
అందరూ సెక్స్ గురించి, ఒక బౌండరీస్ లో ఆలోచిస్తున్నప్పుడు ఆ హద్దులు చేరిపేసి దేశం మొత్తాన్ని షాక్ గురిచేసి ఒక కొత్త కోణం లో ఆలోచింపచేసిన GST రచయిత అయిన జయకుమార్, GST sexual freedom గురించి ఆలోచింపచేస్తే ‘The Director’ sexual exploitation తాలూకు ఆలోచనలను ప్రశ్నిస్తుందని, అందుకే రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఒక మూవీ సెట్ లో ఉన్న హీరోయిన్ ని సెక్సువల్ గా ఎక్సప్లాయిట్ చేసే ఒక డైరెక్టర్ కి సంబందించిన సీన్ ని తలపిస్తూ డైరెక్టర్ కారెక్టర్ ని నగ్నంగా చూపించడం జరిగిందని తెలిపారు.
ఆడా మగా విచక్షణ లేని ఒక దర్శకుడు, మగాళ్ల పరువుతో ఆడుకునే ఒక ఛాన్సుల్లేని హీరోయిన్, సినిమాల భవిషత్తుతో ఆడుకునే ఒక యోగ్యత లేని సినీ విశ్లేషకుని పాత్రలు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పారు. ఈ పాత్రలన్నీ నిజ జీవితంలో కొంతమంది సెలెబ్రిటీలని తలపించేలా ఉండడం గమనార్హం అయినా అవి కల్పితాలు మాత్రమేనన్నారు. ఈ చిత్రంలోని పాత్రల వ్యక్తిత్వాలు, వాటి సంబంధిత కథనాలు, సన్నివేశాలు వివిధ రంగాల్లో ఎప్పటినుండో ఆనవాయితీగా జరుగుతున్న లైంగిక వేధింపులకు మరియు మేధో అత్యాచారాలకు గురిచేస్తున్న పాలక వర్గాలు, గురికాబడుతున్న శ్రామిక వర్గాల ఆధారంగా రూపొందించబడింది అని, copying, casting couch, mee too, వంటి అనేక విషయాల మీద చిత్రంలో చర్చ ఉంటుందని చెప్పారు.
‘‘పక్కనోడి సొత్తుని లాక్కోవడమే నిజమైన పవర్ అనుకుంటూ బ్రతికే చాలా మంది పెద్ద చిన్న మనుషులకు.. నిజమైన పవర్ ని క్రియేట్ చెయ్యాలి కానీ దొబ్బెయ్యకూడదు అనే పాఠం నేర్పించే చిన్న పెద్దమనుషులు తగిలేవరకు వాళ్ళ పెద్దరికపు పేదరికంలోని భావదారిద్ర్యం గురించి తెలీదు. అలాంటి ఒక చిన్నదైన పెద్దతనపు జ్ఞానకాంతికి చిన్నబోయిన పెద్దరికపు అహ మోహాలకు మధ్య జరిగిన సంఘర్షణే The Director’’ అని చెప్పారు.
రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదని, లాక్డౌన్‌ని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని, ఈ లోపు ట్రైలర్స్ రిలీజ్ చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన బోల్డ్ ఫిల్మ్ GST & MERA BETI SUNNY LEONE BANNA CHAHTI HAI కంటే ఇది ఇంకా సెన్సేషన్ సృష్టిస్తుందని, వాటికి మించిన బోల్డ్ అండ్ థ్రిల్ ఉంటుందనే నమ్మకంతో ఉన్నానని తెలిపారు.