Advertisementt

భూమిక మనసు పడ్డ బోల్డ్ క్యారెక్టర్..

Wed 06th May 2020 02:16 PM
bhoomika chawla,tabu,andhadhun,nithin  భూమిక మనసు పడ్డ బోల్డ్ క్యారెక్టర్..
Bhoomika wnats to do Challenging role.. భూమిక మనసు పడ్డ బోల్డ్ క్యారెక్టర్..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో నటించి, స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన భూమిక ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. మహేష్ బాబు ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్ర తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా ఫేడవుట్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నాని హీరోగా నటించిన ఎమ్ సీ ఏ లో వదినగా, బాలక్రిష్ణ రూలర్ లోనూ కనిపించింది.

అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెగ్యులర్ పాత్రలు కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ ని చేయాలని అనుకుంటుందట. ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్ సినిమాలోని టబు లాంటి పాత్ర చేయాలని ఉందని చెప్తుంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ సినిమాని తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని టబు పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని చూస్తున్నారు.

ముందుగా యాంకర్ అనసూయని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత క్యాన్సిల్ అయింది. ప్రస్తుతానికి ఈ క్యారెక్టర్ లో ఎవరు చేస్తారనేది ఇంకా సస్పెన్స్ గా మారింది. మరి అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధం అంటున్న భూమికాని ఈ అవకాశం వస్తుందా లేదా చూడాలి.

Bhoomika wnats to do Challenging role..:

bhoomika wants to doo Challenging role..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ