Advertisementt

అనసూయ అన్నదానిలో తప్పేముంది..!

Wed 06th May 2020 05:14 PM
anasuya,satirical tweet,actress,vijay deverakonda,fake news,tollywood  అనసూయ అన్నదానిలో తప్పేముంది..!
Anasuya satirical tweet viral in social media అనసూయ అన్నదానిలో తప్పేముంది..!
Advertisement
Ads by CJ

అనసూయ ఏ విషయాన్ని అయినా... నిర్భయంగా చెబుతుంది. నెటిజెన్స్ ఎలా ఉన్నా... ఏమనుకున్నా సరే అనసూయ అనుకున్నది అనుకున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తుంది. తాజాగా అనసూయ మరో హాట్ టాపిక్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వెబ్ మీడియా యుద్ధం ఓ రేంజ్ లో పాకింది. టాలీవుడ్ హీరోలంతా ఒకే తాటిపైన చేరి విజయ్ దేవరకొండకి మద్దతు తెలుపుతున్నారు. అయితే అనసూయ మాత్రం తనదాకా వస్తేనేకాని నెప్పి తెలియదా అంటూ ట్వీట్ చెయ్యడంపై పెద్ద దుమారం చెలరేగింది.

వెబ్ మీడియా వాళ్ళు రక్తాన్ని పీల్చేస్తున్నారంటూ... ట్వీట్ చెయ్యడం కూడా సంచలనం అయ్యింది. అయితే అనసూయ మాత్రం తనదాకా వస్తేనే నొప్పి తెలియదా అన్నదానికి మాత్రం విజయ్ ఫాన్స్ తో పాటుగా మహేష్ ఫాన్స్ ఆమెని ఆడుకుంటున్నారు. గతంలో అనసూయకి కూడా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొని ట్విట్టర్ లో పోస్ట్ పెడితే... అందరూ అనసూయని ఆడుకున్నారు. అయినప్పటికీ అనసూయ చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. ప్రస్తుతం విజయ్ కి మద్దతు తెలుపుతున్న హీరోలందరికీ అనసూయ ట్వీట్ సెటైర్ గా కనబడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని ఛానల్స్ లో లైవ్ డిబేట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు, ఫిలిం ఛాంబర్ వద్ద ఆయన తల్లిని తప్పుగా దూషించినప్పటికీ.. ఒక హీరో కూడా మాట్లాడలేదు. కానీ విజయ్ దేవరకొండ లాంటి హీరో ఓ మాటందుకోగానే... హీరోలంతా ఏకమై ఒకే తాటిపైకి రావడం కరెక్టేనా అనేది ఆలోచించాల్సిన విషయమే.

Anasuya satirical tweet viral in social media:

Anasuya satirical tweet on Vijay fake news fight

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ