మహేష్ బాబు - రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? వాళ్ళ కలయికలో ఎలాంటి సినిమా వస్తుందా? అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి బాహుబలి, RRR తర్వాత పిరియాడికల్ బ్యాగ్డ్రాప్ కాకుండా... భారీ విజువల్స్ గ్రాఫిక్స్ లేకుండా ఓ కౌబాయ్ మూవీ చేస్తాడని అంటున్నారు. ఇక మహేష్ కూడా పిరియాడికల్ డ్రామా లాంటి కథతో రాజమౌళితో సినిమా మొదలెడితే.. రెండుమూడేళ్లు కేటాయించాల్సి వస్తుంది అని.. అందుకే మాములు కథతోనే సినిమా చేస్తాడని అన్నారు.
తాజాగా మహేష్ తన కెరీర్ లోనే ఎప్పుడూ పిరియాడికల్ జోనర్ టచ్ చెయ్యలేదు కనక... హిస్టారికల్ బ్యాగ్డ్రాప్ అయినా.. పిరియాడికల్ డ్రామాతో అయినా సినిమా చేస్తే బావుంటుంది అని.. రాజమౌళి లాంటి దర్శకుడితో ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ తీసుకోవడానికి తాను రెడీ అంటూ మహేష్ చెబుతున్నాడట. దాంతో మహేష్ బాబు రాజమౌళి తో బాహుబలి టైపులో ఓ ఫిక్షనల్ హిస్టారికల్ మూవీ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్. మరి మహేష్ - రాజమౌళి కలయికలో తెరకెక్కే మూవీపై ఇలాంటి వార్తలు వస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి. కానీ మరోపక్క రాజమౌళి లాంటి టాలెంట్ డైరెక్టర్ ఏది చెబితే దానికే హీరోలు సై అంటారు కానీ.... ఇప్పుడు ఇక్కడ మహేష్ చెబితే మాత్రం రాజమౌళి చేస్తాడా అంటున్నారు.