ఏదైనా సరే.. అది అబద్ధం కానీ నిజం కానీ జనాలకు త్వరగా రీచ్ కావాలంటే సోషల్ మీడియానే. ఇప్పుడు సర్వం సోషల్ మీడియానే నడిపించేస్తోంది. దీని వల్ల ఎన్ని లాభాలున్నాయో అంతకుమించి నష్టాలు కూడా ఉన్నాయ్. ఇదే మీడియా జీరోను హీరో చేస్తుంది.. అదే హీరోను జీరో చేయాలన్నా ఈ సోషల్ మీడియా చేసేస్తోంది. ఇందుకు ఉదాహరణలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే.. ఈ వీడియోను కాసింత కూడా గమనించకుండానే కొందరు తిట్టి పోసేస్తుండగా.. ఇంకొందరు మాత్రం తెగ కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. చివరికి చూస్తే అసలు విషయం తెలిసొచ్చింది.
వైన్స్ కాదు.. మెడికల్స్..!
లాక్ డౌన్ ఉండటంతో నటీనటులు ఇంటికే పరిమితమైపోయారు. తాజాగా రకుల్ ప్రీత్ ముంబై రోడ్లపై కనిపించింది. అది చూసిన జనాలు ఇంతకీ ఈమె రకులా కాదా..? అని తెలుసుకునే పనిలో పడ్డారు. మాస్క్ ఉండటంతో ఇంతకీ ఆమె ఎవరో చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. ఆమె కారు దిగి రోడ్డు దాటుకుని నేరుగా మెడికల్ షాపుకెళ్లి ‘మందులు’ కొనుక్కొని తిరిగొచ్చేసింది. రోడ్డు దాటుతుండగా గుర్తించిన ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. అయితే.. రకుల్ వెళ్లింది వైన్స్‌కు అని.. ఆమె కొన్నది మందులు కాదని మద్యం అని కొందరు మరీ చీప్‌గా ఆలోచిస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఒక చేతిలో పర్స్, ఇంకో చేతిలో మందులు టానిక్ టైప్ బాటిల్స్ ఉండటంతో దాన్ని అపార్థం చేసుకున్న కొందరు ఇష్టానుసారం మాట్లాడేస్తూ వీడియోను వైరల్ చేస్తూ కామెంట్స్ చేసేస్తున్నారు.
ఇదీ అసలు విషయం..
ఆమె నడిచొచ్చిన దారిని.. ఇంకాస్త క్లోజ్‌లో ఆ షాపును చూస్తే అది వైన్స్ కాదు.. మెడికల్ షాప్ అని తెలుస్తుంది. కాగా దీనిపై కొందరు అభిమానులు క్లియర్‌గా అది ముంబైలోని బాంద్రాలో ఉన్న మెడికల్ స్టోర్ అని క్లారిటీ వివరణ కూడా ఇచ్చారు. అంతేకాదు మాస్క్ వేసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకొని మరీ రకుల్ మెడికల్ స్టోర్‌కు వెళ్లిందని అభిమానులు చెబుతున్నారు. ఏదైనా వీడియో పోస్ట్ చేసేముందు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుంటే పరువు పోకుండా ఉంటుంది.. లేకుంటే అబాసుపాలై ఆఖరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు తస్మాత్ జాగ్రత్త సుమీ. కాగా.. లాక్ డౌన్‌తో తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వందలాది కుటుంబాలకు రోజూ రెండు పూటల భోజనం పెడుతున్న విషయం తెలిసిందే.