టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏదైనా సరే స్ట్రైట్‌గా చెప్పేస్తుంటాడు. అలా ఆయన చెప్పిన మాటలే కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయ్. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో సోషల్ మీడియాను బండ్ల తెగ వాడేస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వరుస ట్వీట్ల వర్షం కురిపిస్తే.. వారిద్దర్నీ ఆకాశానికెత్తేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరి భజన చేశాడని చెప్పుకోవచ్చు. అయితే ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా వైఎస్, నారా, నందమూరి, మెగా ఫ్యామిలీనీ మిక్స్ చేసేసి.. అంటే అటు రాజకీయాలు, ఇటు సినిమాలు మిక్స్ చేసి ఇష్టానుసారం ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేసేశాడు.
సలహాలు ఓకే కానీ...!
ఈ ట్వీట్స్ మొత్తమ్మీద మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ను గట్టిగానే టార్గెట్ చేశాడు. అంతేకాదు.. మీరు నచ్చలేదని.. ఇలా ఉండండి.. అలా ఉండండి అంటూ సలహాలు సైతం బండ్ల ఇచ్చాడు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. మరీ టార్గెట్ చేసినట్లు మాట్లాడటంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర అభ్యంతరమే వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరీ పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ వచ్చాడని అనిపిస్తోంది. సలహాలు ఇవ్వడం వరకూ ఓకే కానీ.. మరీ ఇలా టార్గెట్ చేయడం ఎంతవరకు సబబో బండ్లకే తెలియాలి. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్స్ ఏంటి..? ఆ ట్వీట్స్‌పై టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ఏమంటున్నారో ఓ లుక్కేద్దాం.
గౌరవంతో ట్వీట్స్ ప్రారంభించి..
‘గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో.. రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం కానీ అది చాలా కష్టమని వదిలేసాను. రాజకీయాల్లో వారసత్వం కాదు దమ్ము ధైర్యం ప్రజల్లో నమ్మకం పోరాడుతాడు అన్న ప్రజలకు విశ్వాసం కల్పించడం రాజకీయ నాయకుడి లక్షణం. ఈ ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కె అదృష్టం మీకు దక్కటం నిజంగా మీ అదృష్టం చంద్రబాబు నాయుడు కుమారుడిగా మీరు పుట్టటం. రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు మన దగ్గర మన పార్టీలో నాయకులు అందరూ మన దగ్గర ఎంప్లాయిస్ కాదు ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకొని ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటాను. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య ట్విట్టర్ లో మీరు చేస్తున్న కామెంట్లు మిమ్మల్ని ఇష్టపడే చాలామంది బాధపడుతున్నారు’ అని ఆసక్తికర ట్వీట్ చేశాడు.
జగన్‌లా ఉండాలని కోరుకుంటున్నా..!
‘మీరు అద్భుతంగా పనిచేసి ప్రజలలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా మీ రాజకీయ ఉండాలని మీరు ఆ విధంగా ప్రజా పోరాటం లో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు గా పనిచేసిన ఆయన మంత్రివర్గంలో పనిచేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి కుమారుడు కేటీఆర్ లాగా ఉండాలి. తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్థులు అందరూ ఒక్కటై అణచివేయాలని చూసిన అందర్నీ ఎదిరించి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది రాజకీయాల్లో పట్టు సాధించలేరు ఏమోనని కానీ మీరు నంబర్ వన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని బండ్ల తన మనసులోని మాటలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
కేటీఆర్.. చెర్రీ, ఎన్టీఆర్‌లా ఉండండి..!
‘మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్ లాగా తండ్రికి పోటీ ఇచ్చే విధంగా మీరు కూడా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజకీయనాయకులకి మూడు కావాలి ఒకటి వాళ్ళ పై వాళ్ళ నమ్మకం. రెండు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు నమ్మి రావడం . మూడు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని వీళ్ళ నమ్మటం. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఎవరితో అనుబంధము లేదు.. కానీ మీరంటే మీ నాన్నగారి అంటే నా గౌరవం మీ తాతగారు అంటే నాకెంతో ప్రేమ అందుకోసమే మీకు ఈ విన్నపం. ఎవరు ఏ విధమైన నా సపోర్ట్ చేయకపోయినా నా నంబర్ వన్ పొజిషన్ కి వచ్చినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా మీరు వుండాలి. చంద్రబాబు నాయుడు కుమారుడు గా తప్ప రాజకీయంగా గా మీకు ఏ అర్హత లేదు ఎందుకంటే నాకు తెలిసి మీరు రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడు.. ప్రేమతో మీ బండ్ల గణేష్’ అని తన వరుస ట్వీట్స్‌ను బండ్ల ముగించేశాడు.
దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్..
‘నువ్వు నీ స్థాయికి తగ్గట్టు ఏ రోజాలాంటి వాళ్ళ గురించో మాట్లాడుకో నీ స్థాయికి మించి మాట్లాడాలని ప్రయత్నిస్తే బ్లేడ్ బాబ్జిగా మిగిలిపోతావ్ మాట్లాడడానికి సుఫారీ ఎంత ఇచ్చారు. లోకష్ నీ గురించి గానీ నీ కుటుంబం గురించి గాని మాట్లాడాడా? మరి నీకెందుకు పక్కన వాళ్ళది కేలికి మరి వాసన చూస్తావ్’ అని పలువురు కామెంట్స్ చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం బండ్లా.. మీరు సూపర్ మీరు చెప్పింది 100కు 100 శాతం కరెక్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆయనపై తిట్టిపోస్తుండా.. మరికొందరు మాత్రం బండ్లా భలా అంటూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బండ్ల వ్యాఖ్యలు అటు టీడీపీలో.. ఇటు వైసీపీలో.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి నారా లోకేష్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో..!