Advertisementt

నిఖిల్ అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ ఉండేవాడినే కాదు..

Thu 07th May 2020 05:54 AM
nikhil,chandoo mondeti,karthikeya 2,ram gopal varma   నిఖిల్ అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ ఉండేవాడినే కాదు..
If nikhil couldnt give a chance.. I will not be here నిఖిల్ అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ ఉండేవాడినే కాదు..
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం చాలా కష్టం. చాలా మంది సినిమాల్లో అవకాశాల కోసం ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. అలాంటి వారందరిలో కొందరికే అదృష్టం తలుపు కొడుతుంది. అయితే అదృష్టం తలుపు కొట్టాలంటే టాలెంట్ కూడా ఉండాల్సిందే. కానీ ఎంత టాలెంట్ ఉన్నా, అవకాశం ఇచ్చేవాళ్లు లేకపోతే అదంతా వృధా అవుతుంది. అందుకే అవకాశం ఇచ్చిన వారిని దేవుళ్ళుగా భావిస్తారు.

శివ సినిమా తీసినపుడు రామ్ గోపాల్ వర్మని ఎవరూ నమ్మలేదట. కానీ నాగార్జున ఒక్కడే వర్మని నమ్మి సినిమా తీశాడు. ఆ నమ్మకమే తెలుగు సినిమా చరిత్రలో సంచలనం సృష్టించింది. దేవుడిని నమ్మని రామ్ గోపాల్ వర్మ నాగార్జునే నా దేవుడు అని చెప్పడం చాలా సార్లు విన్నాం. హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయమైన నిఖిల్ కార్తికేయ సినిమాతో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

కలర్స్ స్వాతి హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా చందూకి ఇదే మొదటి చిత్రం. హీరో నిఖిల్ చందూ మీద ఉన్న నమ్మకంతో డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు. అయితే ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకున్న చందూ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అందుకే నిఖిల్ లేకపోతే దర్శకుడిగా ఆయన కెరీర్ లేదని చెబుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ తో కార్తికేయ2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

If nikhil couldnt give a chance.. I will not be here:

Chandoo mondeti explains about Karthikeya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ