సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి, అవకాశాలు అంతగా రాకపోవడంతో బుల్లితెరకి ఫిఫ్ట్ అయ్యి, తన గ్లామర్ తో ప్రేక్షకుల మతులు పోగొడుతున్న యాంకర్ రష్మీ గౌతమ్, లాక్డౌన్ కారణాంగా ఇంటికే పరిమితమైంది. బుల్లితెర మీద హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ సినిమాల్లోనూ నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నీ బోల్డ్ పాత్రల్లోనే కనిపించింది. గుంటూర్ టాకీస్ సినిమాలో ఆమె పాత్ర పట్ల విమర్శలు కూడా వచ్చాయి.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక పాత్ర బాగా వచ్చిందంటే, మళ్లీ ఆ నటుడికి గానీ నటికి గానీ అలాంటి పాత్రలే వస్తుంటాయి. యాంకర్ రష్మీకి కూడా అలాగే జరిగింది. గుంటూర్ టాకీస్ సినిమా తర్వాత ఆమెకి వచ్చినవన్నీ అలాంటి పాత్రలే. అందువల్ల ఆమెపై సెక్సీ క్యారెక్టర్లే చేస్తుందన్న ముద్రపడిపోయింది. దానివల్ల ఆమెకి సాధారణ పాత్రలేవీ దక్కట్లేదట. ఒకవేళ ఆమె ఆ పాత్ర ఒప్పుకోకపోయుంటే పరిస్థితి వేరేలాగా ఉండేదని అంటోంది. అందుకే ఇకపై అలాంటి పాత్రలు చేయనని అంటోంది రష్మీ.