Advertisementt

‘పుష్ప’ లుక్‌కు బ్రేకిస్తున్న బన్నీ..!

Sat 09th May 2020 02:04 PM
allu arjun,pushpa,look change,sukumar,lockdown,bunny  ‘పుష్ప’ లుక్‌కు బ్రేకిస్తున్న బన్నీ..!
Allu Arjun Changed His Pushpa Look ‘పుష్ప’ లుక్‌కు బ్రేకిస్తున్న బన్నీ..!
Advertisement
Ads by CJ

సుకుమార్ - బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప పై అంచనాలు బాగానే ఉన్నాయి ప్రేక్షకుల్లో. పైగా సుకుమార్ - బన్నీ కాంబినేషన్ కాబట్టి మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇక బన్నీ తన లుక్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. ఇందుకోసం న్యాచురాలిటీ వచ్చేందుకు కత్తెర పడకుండా అలాగే చింపిరి జుట్టు, చింపిరి గడ్డం ఉంచేద్దాం అనుకున్నారు. పుష్ప కు సంబంధించి ఫోటోషూట్ నాటికి బన్నీకి పర్ఫెక్ట్ మేకోవర్ అయింది. ఇక షూటింగ్ కి వెళ్తున్న టైములో కరోనా వచ్చింది దాంతో షూటింగ్ కి బాగా గ్యాప్ రావడంతో బన్నీకి జుట్టు, గడ్డం ఇంకా పెరిగింది.

దాంతో ఇప్పుడు బన్నీ జుట్టుకు కత్తెర వేయక తప్పడం లేదట. షూటింగ్ స్టార్ట్ అయ్యే నాటికి పాత లుక్ ని తీసుకుని రావాలని చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో సుకుమార్ కథను మరింత చేంజెస్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే పుష్ప కాస్ట్యూమ్స్ కోసం అల్లు అర్జున్ వేసుకునే బట్టలని టీలో నానబెట్టి ఒక రెండు రోజుల తర్వాత ఉతుకుతున్నారట. కేవలం న్యాచురల్ లుక్ కోసమే సుకుమార్, బన్నీ ఇలా చేస్తున్నారు అని సమాచారం. లాక్ డౌన్ ఎత్తివేయగానే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. హీరోయిన్‌గా రష్మిక నటిస్తుంది. 

Allu Arjun Changed His Pushpa Look:

Allu Arjun Makover changed with Lockdown

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ