అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహర్షి సినిమా తర్వాత మళ్లీ బ్లాక్ బస్టర్ అందుకుని వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్నాడు. అయితే సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ సినిమా పరశురాం దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ విషయమై అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ, ఇదే ఫిక్స్ అని నమ్ముతున్నారు.
అయితే ఇదిలా ఉంటే, గతంలో కేజీఎఫ్ దర్శకుడితో మహేష్ సినిమా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రీకరణలో ఉన్న ఈ దర్శకుడికి మరో సంవత్సరం వరకూ ఖాళీ లేదు. అదీగాక రాజమౌళి- మహేష్ ల కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఆల్రెడీ రాజమౌళి ప్రకటించేశాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఇదే. అయితే వచ్చే సంక్రాంతి ఆర్ ఆర్ ఆర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళికి కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సి వస్తుందని అంటున్నారు.
అలాగే ఇంకా స్టార్ట్ కాని మహేష్ - పరశురామ్ ల సినిమా మొదలై, పూర్తయ్యే వరకి కూడా బాగానే టైమ్ పట్టేలా ఉంది. కాబట్టి కేజీఎఫ్ దర్శకుడూ ప్రశాంత్ నీల్ తో సినిమా అంటే, రాజమౌళితో సినిమా పూర్తయ్యాకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో..!