Advertisementt

కూతురు సెంటిమెంట్ తో బాలయ్య సినిమా..?

Sat 09th May 2020 02:09 PM
balayya,boyapati srinivas,sai madhav burra,b gopal  కూతురు సెంటిమెంట్ తో బాలయ్య సినిమా..?
emotional script for Balayya..? కూతురు సెంటిమెంట్ తో బాలయ్య సినిమా..?
Advertisement
Ads by CJ

నందమూరి బాలక్రిష్ణ ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తుంటాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కుడా యాక్షన్ సినిమానే అని టాక్. నందమూరి అభిమానులు బాలయ్య నుండి కోరుకునేది యాక్షనే కాబట్టి, బాలయ్య ఇప్పటి వరకూ అలాంటి సినమాలే చేస్తూ వచ్చాడు. అయితే రూలర్ సినిమా పరాజయం తర్వాత బాలయ్య మనసు మారిందని అంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కొత్త కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. 

యువ దర్శకులు విభిన్నమైన కథలతో తెలుగు చిత్రపరిశ్రమకి కొత్తదనాన్ని తెస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య కూడా తన సినిమాలో విభిన్నమైన అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడని వినబడింది. బోయపాటి సినిమాలో అఘోరా పాత్ర చాలా బాగుంటుందని అంటున్నారు. ఇకపోతే బాలయ్య మరో సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది. బోయపాటి తర్వాత సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది.

మాటల రచయితగా గుర్తింపు తెచ్చుకున్న బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా స్క్రిప్టుని సిద్ధం చేశాడట. అయితే ఈ సినిమా కూతురు సెంటిమెంట్ తో చాలా ఎమోషనల్ గా సాగుతుందట. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడట. మరి ఇలాంటి పాత్రని అభిమానులు అంగీకరిస్తారా అన్నది చూడాలి. ఇప్పటికైతే ఈ సినిమాపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

emotional script for Balayya..?:

Emotional script for balayya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ