Advertisementt

ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ కామన్ డీపీ

Sat 09th May 2020 02:43 PM
jr ntr,ntrbirthdaycdp,rana daggubati,harish shankar,nagashourya,mehreen,kajal,ss karthikeya,dvv movies,mythri makers  ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ కామన్  డీపీ
NTR bierhday celebrations started... ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ కామన్ డీపీ
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఇంకా పదకొండు రోజుల సమయం ఉంది. మే 20వ తేదీన ఎన్టీఆర్ తన 37వ జన్మదినాన్ని జరుపుకోనున్నాడు. అయితే ఈ నేపథ్యంలో అభిమానుల హంగామా మామూలుగా లేదు. 11రోజుల ముందు నుండే పుట్టినరోజు సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. కరోనా కారణంగా గుంపులు గుంపులుగా ఉండడం నిషేధం కాబట్టి అభిమానులందరూ సోషల్ మీడియాని ఆశ్రయిస్తున్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజుని ట్రెండ్ చేయడానికి సిధ్ధం అయ్యారు. నేడు ఎన్టీఆర్ కామన్ డీపీని 25మంది తారలచే రిలీజ్ చేయించారు. ఎన్టీఆర్ పేరు మీదుగా అంటూ ౨౫ మంది సినిమాకి సంబంధించిన ప్రముఖులు ఈ డీపీని విడుదల చేశారు. 

రానా దగ్గుబాటి మొదలుకుని, కాజల్ అగర్వాల్, రాశీ ఖన్నా, మెహ్రీన్, దేవిశ్రీ ప్రసాద్, హరీష్ శంకర్, జగపతిబాబు, బ్రహ్మాజీ, బండ్లగణేష్, కళ్యాన్ రామ్, నారా రోహిత్, నివేథా థామస్, అనూప్ రూబెన్స్ , కాలభైరవ, వంశీ పైడిపల్లీ, సాయి ధరమ్ తేజ్, వెంకీ కుడుముల, నిధి అగర్వాల్, రుహానీ శర్మ, నాగశౌర్య, బీవీఎస్ ఎన్ ప్రసాద్,  ఎస్ ఎస్ కార్తికేయ, విశ్వక్ సేన్, బాబీ ఇంకా చిత్ర నిర్మాణ సంస్థలైన డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్, హారికా హాసినీ, మైత్రీ మూవీస్, ఎస్వీసీసీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఎన్టీఆర్ కామన్ డీపీని వదిలి ఆహా అనిపించారు.

అంతే కాదు హ్యాష్ ట్యాగ్ ల రూపంలో ట్విట్టర్ ని మోత మోగిస్తున్నారు. బహుశా ఏ హీరోకి పుట్టినరోజుకి  ఇంతలా హడావిడి జరగలేదేమో.

NTR bierhday celebrations started...:

Jr NTR birthday celebrations started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ