ఫిదా సినిమాతో అందర్నీ మెస్మరైజ్ చేసిన సాయిపల్లవి ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ ఒకటి కాగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం మరోటి. రానా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా అడవుల్లోనే జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని నక్సలైట్ల గురించిన కథాంశంతో విభిన్నంగా తీర్చిదిద్దబడుతున్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్, కేరళ, వరంగల్ అడవుల్లో జరిగింది.
అయితే ఒకసారి షూటింగ్ ప్యాకప్ చేసుకుని హోటల్ కి వెళ్తున్న టైమ్ లో ఒక ఏనుగుల గుంపు అక్కడికి వచ్చిందట. ఇరవై దాకా ఉన్న ఆ ఏనుగులని చూసిన వారంతా తలా ఒక దిక్కుకి పోయారట. అక్కడ దర్శకుడు వేణుతో పాటు హీరోయిన్ సాయిపల్లవి కూడా ఉంది. అయితే అక్కడి నుండి తప్పించుకుని సురక్షిత ప్రాంతాల్లోకి వచ్చేశారట. ఎలాంటి నష్టం జరగలేదు కాబట్టి, ప్రస్తుతం ఆ సంఘటన గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారిపోయింది. నేడు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా విరాట పర్వంలోని ఆమె లుక్ ని రివీల్ చేసింది చిత్రబృందం.