Advertisementt

‘కేజీఎఫ్ 2’ని భారీ ధరకు కొనేశారు

Mon 11th May 2020 09:07 AM
kgf 2,rights,amazon,yash,business,sold out  ‘కేజీఎఫ్ 2’ని భారీ ధరకు కొనేశారు
KGF 2 Movie Digital Rights Sold Out ‘కేజీఎఫ్ 2’ని భారీ ధరకు కొనేశారు
Advertisement
Ads by CJ

కన్నడ హీరో యశ్ హీరోగా వచ్చిన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ ఎంతో సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఆ సినిమా కలెక్షన్స్ చూస్తే మనకే అర్ధం అవుతుంది. ఈమూవీ ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో సక్సెస్ కావడంతో ఇప్పుడు దాని సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘కేజీఎఫ్ 2’ టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. అక్టోబర్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ భారీ ధరకి దక్కించుకుంది . ఎన్నడూ లేని విధంగా ఓ దక్షిణ భారత చిత్రానికి 55 కోట్లను చెల్లించినట్టు సమాచారం.

మొదటి పార్ట్ రూ.18 కోట్లకు దక్కించుకుంటే ఇప్పుడు దానికి మూడు వంతులు ఖర్చుచేసి రెండో పార్ట్‌ని ఆ సంస్థ దక్కించుకోడం విశేషం. ఇంతకుముందు టాలీవుడ్ వండర్ ‘బాహుబలి 2’ చిత్రానికి కూడా డిజిటల్ రైట్స్ రూపంలో రూ. 25.50 కోట్లు దక్కాయి. ఇప్పుడు దానికి డబల్ రేట్ ఇచ్చి మరి కొన్నారు అమెజాన్ వారు. ఇక ఈ చిత్రంలో సంజయ్‌దత్, రవీనా టాండన్ వంటి నటీనటులు నటిస్తున్నారు.

KGF 2 Movie Digital Rights Sold Out:

Amazon prime bagged KGF 2 rights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ