Advertisementt

అనిల్ రావిపూడి ప్లానింగ్ మార్చేశాడు..?

Sun 10th May 2020 01:42 PM
anil ravipudi,mahesh babu,balayya,boyapati srinivas  అనిల్ రావిపూడి ప్లానింగ్ మార్చేశాడు..?
Anil Ravipudi changed his plan..? అనిల్ రావిపూడి ప్లానింగ్ మార్చేశాడు..?
Advertisement
Ads by CJ

పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి కళ్యాణ్ రామ్ కెరీర్లో మర్చిపోలేని సినిమాని ఇచ్చిన అనిల్ రావిపూడికి ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేదు. పటాస్ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఒకదానిని మించి మరొక బ్లాక్ బస్టర్ తో దూసుకుపోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ ౩ స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడు.

అయితే ఎఫ్ 3 కంటే ముందే అనిల్ రావిపూడి, నందమూరి బాలక్రిష్ణ హీరోగా సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది. బాలయ్యకి వీరాభిమాని అయిన అనిల్, బాలయ్యతో సినిమా తీద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. ఎఫ్ ౩ సినిమా స్క్రిప్టు పనులు పూర్తయినప్పటికీ, హీరోలుగా చేస్తున్న వెంకటేష్, వరుణ్ తేజ్ లు వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఇప్పట్లో తెరకెక్కే పరిస్థితి కనిపించడం లేదు.

దాంతో బాలయ్యతో సినిమా తీసేద్దామని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే బాలయ్యకి కథ కూడా వినిపించాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయితే కానీ బాలయ్య అనిల్ రావిపూడికి దొరకడు. మరి ఇలాంటి తరుణంలో అనిల్ రావిపూడి ఏం చేస్తాడనేది ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేని అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందంటే బాలయ్య అభిమానుల సంతోషం మామూలుగా ఉండదు.

Anil Ravipudi changed his plan..?:

Anil ravipudi Changed his plan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ