Advertisementt

పూరి జగన్నాథ్ పై కోపంగా ఉన్న మహేష్ అభిమానులు..

Sun 10th May 2020 04:46 PM
david warner,puri jagannadh,mahesh,pokiri   పూరి జగన్నాథ్ పై కోపంగా ఉన్న మహేష్ అభిమానులు..
Mahesh fans fires on Puri Jagannadh.. పూరి జగన్నాథ్ పై కోపంగా ఉన్న మహేష్ అభిమానులు..
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ రెండు సినిమాలు చేశాడు. మొదటి సినిమా పోకిరి ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టింది. రెండవ సినిమా బిజినెస్ మేన్ కూడా బాగానే ఆడింది. బిజినెస్ మేన్ సినిమాని కేవలం అరవై రోజుల్లోనే పూర్తిచేశాడు పూరి. ఒక స్టార్ హీరో సినిమాని అంత తక్కువ టైమ్ లో తెరకెక్కించడం చాలా కష్టం. అయినా పూరి అది చేసి చూపించాడు. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు.

అయితే మహేష్ తో సినిమా తీద్దామని పూరి జగన్నాథ్ జనగణమన స్క్రిప్టు వినిపించాడు . అయితే అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుండి ఏమైందో ఏమో తెలియదు కానీ మహేష్, పూరి ల మద్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. పూరి జనగణమన సినిమా కాదన్నందుకే, వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని అన్నారు. అయితే ఇదిలా ఉంటే, తాజాగా ఆస్ట్రేలియమ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పోకిరిలోని మహేష్ డైలాగ్ చెప్తూ టిక్ టాక్ వీడియోని రిలీజ్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియో గురించి ట్వీట్ చేసిన పూరి జగన్నాథ్, తన సినిమాలో ఒక క్యామియో రోల్ చేయాలని, డైలాగ్ బాగా చెప్పారని ప్రశంసించాడు. అయితే వార్నర్ ని మెచ్చుకున్న పూరి, సినిమాలో ఆ డైలాగ్ చెప్పిన మహేష్ ని ఎందుకు ట్యాగ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. మహేష్ ని ట్యాగ్ చేయకపోవడంతో అభిమానులు పూరి మీద కోపంగా ఉన్నారు. గతంలోనూ పూరి ఇలాగే చేశాడని మహేష్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.

Mahesh fans fires on Puri Jagannadh..:

Mahesh fans fires on Puri Jagannadh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ