Advertisementt

50 మిలియ‌న్ క్లబ్‌లోకి ‘ఉప్పెన’ సాంగ్

Tue 12th May 2020 03:33 PM
uppena,nee kallu neeli samudram,song,50 million views,panja vaisshnav tej,vijay sethupathi,kriti shetty  50 మిలియ‌న్ క్లబ్‌లోకి ‘ఉప్పెన’ సాంగ్
Uppena Nee Kallu Neeli Samudram Song Gets 50 Million Views 50 మిలియ‌న్ క్లబ్‌లోకి ‘ఉప్పెన’ సాంగ్
Advertisement
Ads by CJ

50 మిలియ‌న్ వ్యూస్ సాధించిన ‘ఉప్పెన‌’లోని ‘నీ క‌ళ్లు నీలి స‌ముద్రం’ సాంగ్‌

2020లో సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించిన పాట‌ల్లో ‘నీ క‌ళ్లు నీలి స‌ముద్రం’ ఒక‌టి. దేవి శ్రీ‌ప్ర‌సాద్ కూర్చిన అద్భుత‌మైన ఖ‌వ్వాలీ బాణీల‌కు త‌న మ‌ధుర‌మైన గాత్రంతో జావెద్ అలీ జీవం పోశారు. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను ఇంత ఆక‌ర్ష‌ణీయంగా మార్చేసింది. తాజాగా ‘నీ క‌ళ్లు నీలి స‌ముద్రం’ పాట ఒక మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్‌లో 50 మిలియ‌న్ వ్యూస్‌ను దాటేసింది. చిన్నా పెద్దా తార‌త‌మ్యం లేకుండా అన్ని వ‌య‌సుల వారూ ఈ పాట‌ను ఆస్వాదిస్తుండ‌టం విశేషం.

 

హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి.. ఇద్ద‌రికీ ఇదే తొలి చిత్ర‌మైన‌ప్ప‌టికీ ఈ పాట‌లో వారు ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. సంగీతంలో త‌న అభిరుచితో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. మ‌రో పాట ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ ఇప్ప‌టివ‌ర‌కూ 11 మిలియ‌న్ పైగా వ్యూస్ సాధించ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం. త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ద‌ర్శ‌క‌త్వంతో పాటు క‌థ‌, సంభాష‌ణ‌లు, స్క్రీన్‌ప్లేల‌ను కూడా బుచ్చిబాబు స‌మ‌కూర్చిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది.

 

తారాగ‌ణం:  పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:  

మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

ఆర్ట్‌: మౌనికా రామ‌కృష్ణ‌

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి

సీఈవో: చెర్రీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై., అశోక్ బి.

నిర్మాత‌లు: న‌వీన్ యెర్నేని, వై. ర‌విశంక‌ర్‌

క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా

బ్యాన‌ర్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌

Uppena Nee Kallu Neeli Samudram Song Gets 50 Million Views:

Record views to Uppena Nee Kallu Neeli Samudram Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ