Advertisementt

అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ఐటెం గర్ల్..

Tue 12th May 2020 04:01 PM
nora fatehi,temper,ntr,tollywood,prabhas bahubali  అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ఐటెం గర్ల్..
Item girl Nora fatehi created new record in Instagram అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ఐటెం గర్ల్..
Advertisement
Ads by CJ

సినిమాల్లో ఐటెం సాంగ్ కి చాలా ప్రత్యేకత ఉంటుంది. మిగతా పాటలు ఎలా ఉన్నా ఐటెం సాంగ్ బాగుండేలా చూసుకుంటారు. ఈ ఐటెం సాంగ్స్ లో నర్తించడానికి ప్రత్యేకంగా ఐటెం గర్ల్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లే అవకాశాలు లేకనో, మరే కారణంగానో ఈ ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేస్తున్నారు. దాంతో వాటిని స్పెషల్ సాంగ్స్ గా పిలుచుకుంటున్నారు. అదలా ఉంచితే ప్రస్తుతం ఐటెం గర్ల్ నోరా ఫతేహి అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

టెంపర్ సినిమాలోని ప్రత్యేక గీతంలో ఎన్టీఆర్ తో స్టెప్పులేసిన నోరా ఫతేహి అందరికీ గుర్తుండే ఉంటుంది. బాహుబలి సినిమాలో ఇరుక్కుపో అనే పాటలోనూ ఈమె కనిపించింది. ఐటెం సాంగ్స్ కి స్పెషల్ అట్రాక్షన్ గా మారిన నోరా ఫతేహి కెనడా దేశానికి చెందిన మొరాకో కెనడియన్ ఫ్యామిలీ నుండి వచ్చింది. తెలుగు, మళయాల, హిందీ భాషల్లోని ప్రత్యేక గీతాలకి స్టెప్పులేస్తున్న ఈ భామకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు బాగానే ఉన్నారు.

ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే 13మిలియన్ల మంది ఫాలోవర్లతో మొరాకో దేశంలోనే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇదొక రికార్డుగా పరిగణింపబడింది. దాంతో నోరాఫతేహి చాలా ఆనందంగా ఉంది. ఈ రికార్డు సాధించడానికి కారణమైన నా అభిమానులకు స్నేహితులు నన్ను సపోర్ట్ చేస్తున్న సన్నిహితులు అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపింది.

Item girl Nora fatehi created new record in Instagram:

Nora fatehi created a new record in Instagram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ