సాయి పల్లవి ఏం చేసినా సంచలనమే. సినిమాల్లోనూ విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. గ్లామర్ షో చేయనని ఖరాఖండీగా చెప్పేసింది. దానితో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కోల్పోయినా పర్లేదు అంది. ఇక మొన్నామధ్యన ఫిదా సినిమాలో వరుణ్ లాంటి వాడు దొరికితే పెళ్లి అంది. నేడు పెళ్లి గిళ్లీ జాన్తానై అంటుంది. తాను ఎప్పటికి పెళ్లి చేసుకోనని.. చెప్పి అందరికి షాకిచ్చింది. అది కూడా తన తల్లితండ్రులను చూసుకోవడానికి పెళ్లి వద్దంటుందట. పేరెంట్స్ కోసం పెళ్లి త్యాగం చేస్తుందట సాయి పల్లవి.
కానీ సాయి పల్లవి పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకోను అనడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. అయితే తల్లితండ్రుల కోసం పెళ్లిని త్యాగం చెయ్యడమే అనేది కరెక్ట్ కారణం కాదని.. సాయి పల్లవి ప్రేమలో మోసపోవడం వలనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అంటున్నారు. లేదంటే సినిమాల్లో జరిగినట్టుగా పెళ్లి చేసుకోను, పేరెంట్స్ కోసం ఒంటరిగా ఉంటాను అనడం ఏమిటి అంటున్నారు. మరి సాయి పల్లవి కాలేజ్ డేస్ లోనే ప్రేమ విఫలం చెందడంతో ఇలాంటి డెసిషన్ తీసుకుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది.