Advertisementt

నిహారికను ఇబ్బందుల్లోకి నెట్టేసిన నాగబాబు

Sun 17th May 2020 11:55 PM
niharika,nagababu,marriage,shocking decision,heroine  నిహారికను ఇబ్బందుల్లోకి నెట్టేసిన నాగబాబు
Niharika shocks with Nagababu Decision నిహారికను ఇబ్బందుల్లోకి నెట్టేసిన నాగబాబు
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారిక ఎలాగైనా హీరోయిన్‌గా బ్రేక్ రావాలని కలలు కంటుంది. అందుకే సోషల్ మీడియాని నమ్ముకుని.. దర్శకనిర్మాతలకు హాట్ హాట్ లుక్స్‌తో గాలం వేస్తుంది. రెండు మూడు సినిమాల్లో నటించినా బ్రేక్ రాని నిహారిక ఎలాగైనా ఓ మంచి ఆఫర్ పట్టాలని చూస్తుంది. అందుకే హాట్ హాట్ ఫోటో షూట్స్ తోనూ, డాన్స్ లతోను షేక్ చేస్తుంది. తాజాగా ఓ తమిళ సినిమాలో నిహారిక కాస్త రొమాంటిక్ యాంగిల్ లోనే కన్పించబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేసింది.

అయితే నాగబాబు మాత్రం నిహారిక ఆశలపై నీళ్లు చల్లాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని.. వచ్చే ఏడాది నిహారిక పెళ్లి అని బహిరంగంగా ప్రకటించాడు. దానితో నిహారిక షాకయ్యిందో లేదో కానీ.. మెగా ఫాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే పెళ్లి తర్వాత హీరోయిన్ గా చెయ్యడానికి నేనేమన్నా సమంత నా.. అందుకే పెళ్ళికి ముందు వీలైనన్ని సినిమాల్లో నటించాలని ఉందని చెప్పింది. ఇక తాజాగా నాగబాబు ప్రకటనతో నిహారికకు సినిమా ఇస్తే.. ఒకవేళ మధ్యలో పెళ్లి కుదిరితే తమ సినిమాకి మధ్యలోనే బ్రేక్ పడుతుందని భావించి.. అందుకే నిహారిక ని హీరోయిన్ గా తీసుకుంటే.... మనకి ఇబ్బంది తప్పదని దర్శకనిర్మాతలు డిసైడ్ అయినా అవ్వొచ్చు.. సో నిహారిక హీరోయిన్ గా టాప్ కి వెళదామనుకుంటే.. నాగబాబు అడ్డం పడుతున్నాడు.

Niharika shocks with Nagababu Decision:

Niharika Marriage Soon says Nagababu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ