టాలీవుడ్‌లో కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత ‘ఓం నమో వెంకటేశాయ’, మంచు మనోజ్‌తో ‘గుంటూరోడు’, కృష్ణవంశీ ‘నక్షత్రం’, మంచు విష్ణుతో ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి సినిమాలు చేసి ఆ తరువాత నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్న ఆమె తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఫాలోయర్స్ అడిగిన ప్రశ్నలను చాలా ఇంట్రెస్టింగ్ గా సమాధానాలు ఇచ్చింది.
మీరు 2018 నుండి సినిమాలు చేయకపోవడానికి కారణం?
మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను.
సమంత గురించి ఒక్క మాటలో?
ఆమె నాకు స్ఫూర్తి.
నాగార్జున తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
ఆయన గొప్ప నటుడే కాదు మంచి వ్యక్తి కూడా.
లాక్ డౌన్ లో మీరు చేసే బెస్ట్ పని ఏంటి?
కుకింగ్ నేర్చుకోవడం.
ప్రస్తుతం ఏ వెబ్ సిరీస్ చూస్తున్నారు?
ది లాస్ట్ కింగ్ డమ్.
మీరు నటి లేకపోయినట్టు అయితే ఏం అయ్యేవారు?
లాయర్.
మీరు ఏ డైరెక్టర్ తో పని చేయాలి అనుకుంటున్నారు?
రాజమౌళి అండ్ సంజయ్ లీల భన్సాలీ.
పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో?
నిజమైన నాయకుడు.