Advertisementt

పానీపూరి కోస ఇంత ఆరాటమా..?

Mon 18th May 2020 05:13 PM
biggboss,himaja,lockdown celebrities,covid19,coronavirus  పానీపూరి కోస ఇంత ఆరాటమా..?
Bigg boss beauty missing Panipuri పానీపూరి కోస ఇంత ఆరాటమా..?
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా మనం చాలా మిస్సవుతున్నాం. భవిష్యత్తులోనూ మనం మిస్సయిన వాటిని యథాతథంగా పొందుతామా అన్నది సందేహంగా ఉంది. కరోనా వల్ల ప్రపంచ జీవితమే మారిపోయింది. ఒకప్పుటి జీవితానికి కరోనాతో కలిసి జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకూ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని అర్థం అవుతోంది. ప్రభుత్వాలు కూడా ఇదే చెబుతున్నాయి.

అయితే ఈ నేపథ్యంలో కరోనా వల్ల స్ట్రీడ్ ఫుడ్ మిస్సవుతున్న వారు కోకొల్లలు. ఇంతకుముందు ఎక్కడపడితే అక్కడ ఏది నచ్చితే అది కొనుక్కుని తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడలా లేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తు కూడా అలా ఉండదేమో అనిపిస్తుంది. దానివల్ల స్ట్రీట్ ఫుడ్ ని మిస్సవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మిస్సవుతున్న వారిలో బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా ఒకరు.

బిగ్ బాస్ మూడవ సీజన్ ద్వారా హిమజ పాపులారిటీ బాగా పెరిగింది. అయితే తాజాగా ఆమె చేసిన ఒకపని కొంచెం నవ్వు తెప్పించినా కూడా నిజమే కదా అన్పిస్తోంది. పానీపూరి తినడాన్ని ఇష్టపడే హిమజ, ఇప్పుడు అలాంటివి తినే అవకాశం లేక, టీవీలో పానీ పూరి బండి విజువల్ ని చూస్తూ నాకు కొంచెం పానీ వేయమని చేయిచాపి అడుగుతూ, అతను వేయకపోయేసరికి నిరాశ పడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Bigg boss beauty missing Panipuri:

Himaja missing Panipuri

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ