Advertisementt

అమ్మలా లేవని తిడుతున్నారు: శ్రీదేవి డాటర్

Tue 19th May 2020 06:00 PM
khushi kapoor,instagram post,viral,sridevi daughter,jhanvi kapoor  అమ్మలా లేవని తిడుతున్నారు: శ్రీదేవి డాటర్
khushi kapoor Instagram post goes viral అమ్మలా లేవని తిడుతున్నారు: శ్రీదేవి డాటర్
Advertisement
Ads by CJ

శ్రీదేవి కూతుళ్లు అనగానే శ్రీదేవిలానే ఉంటారు. శ్రీదేవి పోలికలతో ఆమెలా అందంతో, అభినయంతో అల్లుకుపోతారు అనుకుంటారు అభిమానులు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ శ్రీదేవి అందాన్ని పుణుకు పుచ్చుకుంది. జాన్వీ కపూర్ ఇప్పటికే సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసి... వరస సినిమాల్తో బిజీగా మారింది. ఇక జిమ్‌కి వెళుతూ చిట్టి పొట్టి డ్రెస్సులతో అందాలు ఆరబోస్తుంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ అమ్మలా అందంగా లేకపోయినా.. గ్లామర్ షో చెయ్యగల సత్తా ఉన్న అమ్మాయి. కాస్త పళ్ళు ఎత్తుగా కనబడినా.. అమ్మాయి మాత్రం చిట్టి పొట్టి డ్రెస్సులతో అలరిస్తుంది. ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ.. ఫ్యాషన్ షోస్ లో అదిరిపోయే డ్రెస్సులతో అదరగొడుతుంది.

అయితే తాజాగా నటనలో శిక్షణ తీసుకుంటున్న ఖుషి కపూర్ తాను కొన్నిసార్లు శ్రీదేవి అభిమానుల వలన హర్ట్ అవుతున్నట్లుగా చెబుతుంది. కొంతమంది తన తల్లి శ్రీదేవి రూపం కానీ, రంగు కానీ రాలేదంటూ ఖుషి కపూర్ మీద జోక్స్ వేస్తున్నారట. ఆ విషయాన్నీ ఖుషి కపూర్ క్వారంటైన్ వన్ అంటూ ఓ వీడియో‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నేను ఓ వ్యక్తిగా ఎంత ఉన్నతంగా ఉండాలి అనుకున్నానో.. ప్రస్తుతానికి అలా లేను. కానీ రోజు రోజుకి ఎదుగుతున్న.. కొంతమంది శ్రీదేవి కూతురు అయిన నాపై విపరీతమైన అభిమానాన్ని కురిపిస్తున్నారు. మరికొంతమంది మాత్రం శ్రీదేవి అందం రాలేదు. అలాగే నన్ను ఇంకా విమర్శిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి విద్వేష పూరిత మాటలు వింటుంటే కాస్త బాధగా ఉంది అంటుంది. అలా తన మనసులోని బాధను బయట పెట్టింది. 

khushi kapoor Instagram post goes viral:

They are very insulted me.. says khushi kapoor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ