హీరోయిన్ ఛార్మి అవకాశాలు సన్నగిల్లగానే దర్శకుడు పూరి జగన్నాధ్ ని నమ్ముకుని నిర్మాతగా మారిపోయింది. అయితే ఈమధ్యన ఛార్మి మళ్ళీ నటనకు రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలొస్తున్నాయి. రమ్యకృష్ణ లాగా పవర్ ఫుల్ పాత్రల్లో ఛార్మి కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ రావడంతో.. ఛార్మి పుట్టినరోజునాడు ఛార్మి నటనకు సంబందించి కీలక ప్రకటన చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి నిత్యం కొత్త హీరోయిన్స్ వస్తున్నారని.. వారంతా టాలెంట్ ఉన్న హీరోయిన్స్ అని.. ఇలాంటి టైం లో తానింక సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదని.. చెబుతుంది.
అసలు జ్యోతి లక్ష్మి టైం లోనే సినిమాలకు స్వస్తి చెబుదామనుకున్నా అని...కానీ పూరి జగన్నాధ్, కళ్యాణ్ ల సలహాతో అప్పుడు ఆ ప్రకటన చెయ్యలేదని.. కానీ ఇకపై సినిమాల్లో నటించనని ఛార్మి స్పష్టం చేసింది. ఇకపై నిర్మాతగా మాత్రమే కొనసాగుతా అని చెప్పింది. ఇప్పటికే పూరి జగన్నాధ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అంటూ సినిమాలు నిర్మిస్తూ ఛార్మి బిజీగా ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ తో ఛార్మి పాన్ ఇండియా నిర్మాతగా మారింది.