Advertisementt

ప్రభాస్ విలన్‌గా.. బంపర్ ఆఫర్!

Wed 20th May 2020 02:48 AM
young rebel star,prabhas,villain,aditya chopra,dhoom series,bollywood  ప్రభాస్ విలన్‌గా.. బంపర్ ఆఫర్!
Bumper Offer to Young Rebel Star Prabhas ప్రభాస్ విలన్‌గా.. బంపర్ ఆఫర్!
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. బాహుబలితో బలంగా పాతుకుపోయిన ప్రభాస్ సాహోతో పాన్ ఇండియాలో ఓడిపోయాడు. అయినప్పటికీ... బాలీవుడ్ లో ప్రభాస్ కి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడడంతో.. సాహో అక్కడ బాగా హిట్ అయ్యింది. అయితే ప్రభాస్ బాహుబలి, సాహో తర్వాత బాలీవుడ్ దర్శకులతో సినిమాలు అంటాడు అనుకుంటే.. తెలుగు దర్శకులైన రాధాకృష్ణ, నాగ్ అశ్విన్ తో సినిమాలు చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ దర్శకులతో ప్రభాస్ కి సినిమా చేయాలని ఉన్నప్పటికీ... ప్రస్తుతానికి ప్రభాస్ ఆ సాహసం చెయ్యడం లేదు.

అయితే మొన్నామధ్యన ప్రభాస్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ వారు ధూమ్ ప్రాంచైజీలో నర్తించమని అడిగినట్లుగా వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆదిత్య చోప్రా ప్రభాస్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడని.. బాహుబలి, సాహో సినిమాల్లో ప్రభాస్ యాక్షన్ చూసిన ఆదిత్య చోప్రా కి ప్రభాస్ తో విలనవతారం ఎత్తించాలనే కోరిక కలిగిందట. దానితో ప్రభాస్ ని ధూమ్ 4 లో విలన్ గా చూపించాలనే ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా టాక్. ప్రభాస్ కటౌట్ చూసి ఆదిత్య చోప్రా బాగా ఇంప్రెస్స్ అయ్యాడని.. దానితో ప్రభాస్‌ని ఎలాగైనా విలనవతారం ఎత్తించాలని.. అందుకే ప్రభాస్ కి ఎంతైనా ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యాడని అంటున్నారు. మరి బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్, జాన్ అబ్రహం, హ్రితిక్ రోషన్ లకు దొరికే ఛాన్స్ ఇప్పుడు ప్రభాస్ కి దొరికింది. కానీ ప్రభాస్ ఒప్పుకోవాలిగా. కానీ ప్రభాస్ ని విలన్ గా చూస్తే మాత్రం అదిరిపోతోంది.

Bumper Offer to Young Rebel Star Prabhas:

Villain Chance to Young rebel star Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ