గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. టిక్ టాక్ ద్వారా తెలుగు సినిమాల్లోని పాటలకి డాన్సులు చేస్తూ, డైలాగులకి పెదవి కలుపుతూ ఆనందాన్ని పంచుతున్నాడు. అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ సాంగ్ కి కాలు కదిపిన వార్నర్, ఆ తర్వాత పోకిరి డైలాగ్ తో మరిపించి, బాహుబలి వేషధారణలో మురిపించాడు. అయితే ఈ రోజు మరింత సరికొత్తగా టిక్ టాక్ ద్వారా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలియజేశాడు.
నేడు తన 37వ జన్మదినం జరుపుకుంటున్న నందమూరి తారక రామారావుకి శుభాకాంక్షలు వెల్లవలా వస్తున్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు, దేశవ్యాప్తంగా పాపులార్ పర్సనాలిటీస్ ఎన్టీఆర్ కి విషెస్ తెలియజేస్తున్నారు. క్రికెటర్లు కోహ్లీ ఎన్టీఆర్ కి ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు. ఇక ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డాన్సు చేసి మరీ విషెస్ చెప్పాడు. జనతా గ్యారేజిలోని పక్కా లోకల్.. పక్కా లోకల్.. అనే పాటకి డాన్స్ చేసిన వార్నర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.