భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. సౌత్ నుండి నార్త్ వరకూ ఎక్కడా బాహుబలిని కొట్టే సినిమానే రాలేదు. కానీ ఒక్క సినిమా బాహుబలిని మళ్లీ గుర్తుచేస్తోంది. అదే కేజీఎఫ్ 2. కేజీఎఫ్ ఏ చడీ చప్పుడు లేకుండా రిలీజై బాక్సాఫీసుని షేక్ చేసింది. దాంతో అందరి చూపులు కేజీఎఫ్ 2 మీదే ఉన్నాయి. దసరా కానుకగా విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం రికార్డులని క్రియేట్ చేస్తుంది.
మొన్నటికి మొన్న డిజిటల్ హక్కులని 55కోట్లకి సొంతం చేసుకుని అందరికీ షాకిచ్చిన ఈ చిత్రం, తాజాగా శాటిలైట్ హక్కుల రూపంలో మరోమారు ఆశ్చర్యపరుస్తుంది. కేజీఎఫ్ 2 శాటిలైట్ హక్కుల కోసం విపరీతమైన పోటీ నడుస్తుందట. ఆ పోటీలో భాగంగా డిమాండ్ కొండెక్కి కూర్చుంది. దాంతో కేజీఎఫ్ 2 శాటిలైట్ హక్కులు 120 కోట్లకి అమ్ముడయ్యాయని టాక్ వినబడుతోంది.
అంటే శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు కలుపుకుంటే 175 కోట్లు అవుతుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఒక చిత్రానికి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అంటే చిన్న విషయం కాదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హాంబేల్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తుంది.