Advertisementt

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డిజప్పాయింట్ తప్పలేదు

Thu 21st May 2020 02:52 AM
tarak,jr ntr,birthday,disappointed,fans,trivikram,rrr  ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డిజప్పాయింట్ తప్పలేదు
Full Disappoint to jr NTR Fans on his Birthday ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డిజప్పాయింట్ తప్పలేదు
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఎన్టీఆర్ స్పెషల్ లుక్ కానీ, లేదంటే RRR సినిమా స్పెషల్ వీడియో కానీ, ఇక త్రివిక్రమ్ మూవీ కి సంబందించిన ఎన్టీఆర్ లుక్ కానీ విడుదలవుతుంది అనుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేసారు. నిజంగా రామ్ చరణ్ పుట్టిన రోజుకి RRRకి సంబందించిన RRR టీం ఓ స్పెషల్ వీడియోని విడుదల చేసి మెగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసిన మూవీ ఎన్టీఆర్ బర్త్ డే కి మాత్రం ఎలాంటి వీడియోని విడుదల చెయ్యలేకపోయింది. కారణం కరోనా లాక్డౌన్. కరోనా లాక్డౌన్ ముందు రామ్ చరణ్ పుట్టిన రోజుకి వీడియోని సిద్ధం చేసిన టీం.. కరోనా లాక్డౌన్ లో ఎన్టీఆర్ వీడియోని చెయ్యలేక చేతులెత్తేసి ఎన్టీఆర్ ఫాన్స్ ని తెగ డిజప్పాయింట్ చేసారు. ఎన్టీఆర్ కూడా చేసేదేమి లేక ప్లీజ్ ఏమనుకోకండి.. కరోనాతో RRR టీం ఎలాంటి లుక్ కానీ, వీడియో కానీ విడుదల చేయలేకపోతోంది అంటూ ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేసాడు.

ఇక త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ బిజినెస్ మ్యాన్ లుక్ అయినా విడులవుతుంది అనుకుంటే... అది కూడా లేదు. నిజం ఎన్టీఆర్ ఫాన్స్ గత ఏడాది ఏమో హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ క్యాన్సిల్ అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజుకి కరోనా అడ్డు పడింది. ఎన్టీఆర్ ఫాన్స్ గత రెండు పుట్టినరోజులకి ఇలా డిజప్పాయింట్ అవుతూ.. ఉసూరుమంటున్నారు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తోనో, అట్లీ తోనో సినిమా అంటూ ప్రకటన వస్తుంది అనుకుంటే.. అదీ లేదు. కేవలం జిమ్ ట్రైనర్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ విడుదల చేస్తే దానితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఫుల్ గా డిజప్పాయింట్ అయ్యారు.

Full Disappoint to jr NTR Fans on his Birthday:

No Surprise to jr ntr Fans on his Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ