టాలీవుడ్ వివాదాస్పద నటి.. కాంట్రవర్సీ క్వీన్‌గా పేరొందిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆమె గురించి జనాలందరికీ బాగా తెలిసిందే. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు నాలుగు వివాదాలు.. ఆరు కొట్లాటలు అనే తీరుగా ఉన్న ఈ హాట్ భామ.. చెన్నైకి చెక్కేసినా ఊరు మారొచ్చేమో కానీ.. కాంట్రవర్సీ.. కాంట్రవర్సీనే అన్నట్లుగా మరింత డోస్ పెంచి మరీ ప్రవర్తిస్తోంది. అక్కడికెళ్లాక కొత్తగా టిక్ టాక్ అకౌంట్ చేసిన ఈ భామ హాట్ హాట్ సొగసులతో కుర్రాళ్లను కైపెక్కిస్తూ డైరెక్టుగానే అలా.. ఇలా అని తెగ కామెంట్స్ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ హీరోలపై ముఖ్యంగా తనకు అన్యాయం చేశారని చెప్పుకుంటున్న వారిని మాత్రం అస్సలు వదలట్లేదు. సమయం సందర్భంగా వచ్చినప్పుడు ఇన్ డైరెక్టుగా.. డైరెక్టుగా కామెంట్స్ చేస్తూనే ఉంది.
రామానాయుడు స్టూడియోలో..!
ఇక అసలు విషయానికొస్తే.. యంగ్ హీరో రానా దగ్గుబాటి తనకు కాబోయ్ భార్య మిహిక బజాజ్‌ని ఇటీవలే పరిచయం చేశాడు. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని.. త్వరలోనే (మే-20న) అని అనుకున్నారు. కానీ ఆ ప్రక్రియ ఇంకా జరగలేదు. అసలు ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. ఇదే విషయమై రానా తండ్రి ప్రముఖ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబును అడగ్గా.. ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వలేదని స్పష్టం చేశాడు. వాస్తవానికి ఈ నిశ్చితార్థ వేడుకకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో వేదిక కావాల్సి ఉంది. బాగా కావాల్సిన వారి మధ్యే ఈ వేడుక జరుగుతుందని వార్తలు వినిపించాయి.
శ్రీరెడ్డి కోరిక నెరవేరేనా..!?
అయితే దీనిపై కాంట్రవర్సీ హాట్ బ్యూటీ శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘ ఇవాళ రామానాయుడు స్టూడియోస్‌లో రానా బావ ఎంగేజ్‌మెంట్. తరువాత నాదే’ అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. రానా సోదరుడు అభిరామ్ తనను వాడుకున్నాడని ఇదిగో ఇదే సాక్ష్యమంటూ ఫొటోలు, వీడియోలతో సహా మీడియా వేదికగా ఆమె రిలీజ్ చేసి అప్పట్లో శ్రీరెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సో.. అభిరామ్‌నే పెళ్లాడాలని శ్రీరెడ్డి ఫిక్సయ్యిందన్న మాట. అసలు ఈ ఎంగేజ్మెంట్ జరిగేనా..? శ్రీరెడ్డి కోరిక నెరవేరేనా..? ఏం జరుగుతుందో వేచి చూడాలి. మొత్తానికి చూస్తే.. మరో వివాదానికి శ్రీరెడ్డి తెరలేపడానికి సిద్ధమైందన్న విషయం మాత్రం స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది.