నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజున టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా ఎన్టీఆర్ కి స్పెషల్ గా విషెస్ చెప్పారు. రామ్ చరణ్.. సోదరా హ్యాపీ బర్త్ డే.. సెలెబ్రేషన్స్ ముందుముందున్నాయి అంటూ ట్వీట్ చేసాడు. అయితే అందరూ ఎన్టీఆర్ కి చెప్పిన విషెస్ ఒక ఎత్తైతే.... కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ పై ప్రేక్షకుల్లో ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కథ వినిపించాడని, ఇప్పటికే మూవీ ఓకే అయ్యింది అని, అసలు నిన్నే ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఎనౌన్స్‌మెంట్ వచ్చేదని అన్నారు.
అయితే అదంతా కేవలం ఊహాగానమా? లేదంటే నిజమా? అనేది నిన్న క్లియర్ కట్ గా తేలిపోయింది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి చెప్పిన బర్త్ డే విషెస్ అలా ఉంది. ఒక న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా వుంటుందో చివరికి నాకు తెలిసొచ్చింది... నీ చుట్టూ వుండే ఆ క్రేజీ ఎనర్జీని తట్టుకోవడానికి మళ్లీ వచ్చినప్పుడు రేడియేషన్ సూట్ తెచ్చుకుంటానులే.. హ్యాపీ బర్త్ డే సోదరా.. అంటూ చేసిన ట్వీట్ తెగ హైలెట్ అయ్యింది. అంటే ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ ఎంత దగ్గరగా చూడకపోతే అంతలాంటి ట్వీట్ చేసాడు. దీని బట్టి ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబో ఫిక్స్.. జస్ట్ ప్రకటన రావడమే తరువాయి. మరి కెజిఎఫ్ తో దడదడలాడించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా లెవల్లో సినిమా మొదలెడితే ఉంటుంది క్రేజు.. అబ్బబ్బ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇంతకన్నా ఏం కావాలి.