Advertisementt

ప్రభాస్‌కి అలియా హైట్ సరిపోతుందా..?

Sat 23rd May 2020 07:07 PM
prabhas,alia bhatt,heroine,nag ashwin,deepika padukone,prabhas heroine,height  ప్రభాస్‌కి అలియా హైట్ సరిపోతుందా..?
Alia Bhatt in Prabhas and Nag Ashwin Film! ప్రభాస్‌కి అలియా హైట్ సరిపోతుందా..?
Advertisement
Ads by CJ

రాజమౌళి RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ కోసం బాలీవుడ్ భామ అలియా భట్ ని మోడరన్ సీతమ్మగా టాలీవుడ్ కి దింపుతున్నాడు. RRR పాన్ ఇండియా ఫిలిం కాబట్టి అలియా మారు మాట్లాడకుండా ఒప్పేసుకుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లాంటి నట దిగ్గజాల మధ్యన అందం అణుకువ, చిలిపిదనం ఉన్న హీరోయిన్స్ లో మేటిగా కనబడిన అలియా భట్ ని RRR కోసం తీసుకున్నామని రాజమౌళి ఇంతకుముందే చెప్పాడు. ఇక అలియా భట్ తో RRR షూటింగ్ జరగలేదు. కరోనా లాక్ డౌన్ ముగియగానే.... అలియా భట్ తో తెరకెక్కించాల్సిన సీన్స్ ని రాజమౌళి మొదలెడతాడు.

 

అయితే తాజాగా అలియా భట్ పేరు మరో పాన్ ఇండియా ఫిలిం కోసం వినబడుతుంది. అది కూడా ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో అలియా భట్ ని నాగ్ అశ్విన్ సంప్రదించబోతున్నాడనే న్యూస్ బాలీవుడ్ వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాహుబలితో ప్రభాస్ పక్కన నటించాలని అనుకున్న బాలీవుడ్ హీరోయిన్స్ లో అలియా భట్ కూడా ఉంది. అయితే మొదట్లో ప్రభాస్ సరసన దీపికా పేరు వినబడినా.. దీపికా పేరు సైడ్ అయ్యి.. తాజాగా అలియా భట్ పేరు ప్రచారంలోకొచ్చింది. అయితే ప్రస్తుతం ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాల్తో అస్సలు డేట్స్ ఖాళీ లేని అలియా ప్రభాస్ సినిమా ఒప్పుకుంటుందా? అయినా ప్రభాస్ హైట్ ముందు అలియా సరిపోతుందా? అనే సందేహాలు లేకపోలేదు.

Alia Bhatt in Prabhas and Nag Ashwin Film!:

Gossips on Alia Bhatt Height for Prabhas Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ