విజయ్ దేవరకొండ ఇప్పుడు పెద్ద స్టార్. టాలీవుడ్ స్టార్ హీరోలే పాన్ ఇండియా అంటే భయపడుతున్న టైం లో విజయ్ దేవరకొండ చిన్న కథతో ధైర్యంగా పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. అయితే విజయ్ దేవరకొండ సెట్స్‌లో ఉంటే అంతా కూల్ అంటుంది ఓ హీరోయిన్. ఆమె ఛార్మి. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ దర్శకుడిగా నిర్మాతగా ‘ఫైటర్’ సినిమా తెరకెక్కిస్తుంటే... ఛార్మి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాకి పని చేస్తుంది. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయినా సెట్స్‌లో బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టే విషయంలో ఛార్మి సూపర్ అంటున్నారు.
అయితే తాజాగా ఫైటర్ సినిమా టైటిల్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. విజయ్ - పూరి సినిమాకి అదిరిపోయే టైటిల్ ఆల్రెడీ సెట్ అయ్యింది అని... త్వరలోనే మంచి ముహుర్తం చూసి టైటిల్ ప్రకటన ఉంటుంది అని చెప్పిన ఛార్మి తాజాగా హీరో విజయ్ దేవరకొండనే కాదు.. హీరోయిన్ అనన్య పాండేని కూడా మోసేస్తుంది. హీరోయిన్ అనన్య సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ అని.. ఈ సినిమా తర్వాత ఇండియాలో టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరిగా అనన్య ఉంటుందని..... అనన్యలో మంచి టాలెంట్ ఉందని చెబుతుంది. అంతేకాకుండా విజయ్ సెట్స్‌లో ఉంటే హాయిగా ఉంటుందని, టెన్షన్స్ ఉండవని చెబుతుంది ఛార్మి.