Advertisementt

అనన్య పాండేపై అప్పుడే రూమర్స్ వచ్చాయంట!

Mon 25th May 2020 07:49 PM
ananya panday,puri jagannadh,fighter,chit chat,ananya panday actress,bollywood  అనన్య పాండేపై అప్పుడే రూమర్స్ వచ్చాయంట!
Ananya Panday Reaction on Rumors అనన్య పాండేపై అప్పుడే రూమర్స్ వచ్చాయంట!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో నటించిన రెండు సినిమాలతోనూ హిట్స్ కొట్టిన అనన్య పాండే ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం తహతహలాడుతోంది. పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఈ లేలేత అందాల భామ అనన్య పాండే ఈ మూడో హిట్ పై చాలా ఆశలే పెట్టుకుంది. కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన అనన్య పాండే.. తాజాగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ..  స్టూడెంట్ అఫ్ ద ఇయర్ 2 తో హీరోయిన్ గా పరిచయమైన నేను ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టా అని.. తర్వాత పతి పత్ని ఔర్ హో సినిమాతోనూ హిట్ అందుకున్నా అని... అయితే హ్యాట్రిక్ హిట్ పై కన్నేసిన పెద్దగా ఒత్తిడి ఫీలవడం లేదని చెబుతుంది అనన్య పాండే. ఇక నటిగా పేరు తెచ్చుకోవడానికి ఎంతగా కష్టపడాలో అంతగా కష్టపడుతున్నట్లుగా చెబుతుంది.

ఇక ఇషాన్ ఖట్టర్ తో నటించిన సినిమా షూటింగ్ కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. కరోనా లాక్‌డౌన్ లేకపోతే ఆ సినిమా జూన్ లోనే థియేటర్స్ లోకి వచ్చేది. ఇక నేను హీరోయిన్‌గా ఎదుగుతున్న టైం లోనే నేను ప్రేమలో ఉన్నా అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. చాలా సందర్భాల్లో అనన్య పాండే ప్రేమలో ఉంది అంటూ వార్తలొచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలు. అందులో ఎలాంటి నిజం లేదు. నేను చెప్పడానికంటే ముందే ఆ రూమర్స్ అమ్మ వాళ్ళ చెవికి చేరాయి. నా తల్లితండ్రులతో నేను చాలా క్లోజ్‌గా ఉంటాను. ఏ విషయమైనా ధైర్యంగా వాళ్లతో పంచుకుంటాను. వాళ్ళు నన్ను పూర్తిగా అర్ధం చేసుకుంటారు. ఇక నేను విజయ్ తో కలిసి పూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ముంబై లో చాలా వరకు షూటింగ్ జరిగింది. అందులో నేను - విజయ్ కలిసి నటించిన సన్నివేశాలు కూడా ఉన్నాయని చెబుతుంది అనన్య పాండే.

Ananya Panday Reaction on Rumors :

Ananya Panday Chit Chat Details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ