ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయకి వైఫల్యాలు ఎదురవుతున్నా అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. ఆర్ ఎక్స్ ౧౦౦ సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న కార్తికేయ, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో విఫలం అవుతూనే ఉన్నాడు. కార్తికేయ హీరోగా వచ్చిన 90 ఎమ్ ఎల్ చిత్రం కూడా డిజాస్టర్ అనిపించుకుంది. అయితే ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా చావు కబురు చల్లగా అనే సినిమా స్టార్ట్ చేశాడు.
హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా కష్టాలు పడుతున్న టైమ్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి. కౌశిక్ పెగళ్లపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజుగా కనిపించనున్నాడు. పూర్తి మాస్ కథాంశంతో సినిమా ఆద్యంతం కొత్తగా ఉంటుందని అంటున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా కోసం హీరో హీరోయిన్లు ప్రాక్టీసు మొదలెట్టేశారు.
కౌశిక్ పెగళ్లపాటి నటీనటులందరికీ స్క్రిప్టు చదివి వినిపిస్తున్నాడట. సినిమాలో తమ పాత్ర ఎలా ఉంటుందో ముందే వారికి వివరిస్తున్నాడట. అందులో భాగంగా హీరో, హీరోయిన్ సినిమా స్క్రిప్టు చదువుతూ ప్రాక్తీసు చేస్తున్నారని సమాచారం. హీరోగా పరిచయమై, విలన్ గానూ ప్రయత్నించి మళ్ళీ హీరోగా మెప్పించే పాత్రలు చేయలన్న ఉద్దేశ్యంతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనముందుకు కార్తికేయకి చావు కబుతు చల్లగాతోనైనా విజయం అందుకుంటాడేమో చూడాలి.