Advertisementt

‘వకీల్ సాబ్’కు పవన్ కల్యాణ్ రిక్వెస్ట్..!

Tue 26th May 2020 06:34 PM
pawan kalyan,vakeel saab,request,dil raju,shooting,rest  ‘వకీల్ సాబ్’కు పవన్ కల్యాణ్ రిక్వెస్ట్..!
Pawan Kalyan Takes One More Month for Rest ‘వకీల్ సాబ్’కు పవన్ కల్యాణ్ రిక్వెస్ట్..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ డబ్బులు కోసం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరసగా సినిమాలు ఒప్పేసుకుని... బిజీబిజీగా షూటింగ్ చేసేసాడు. వరసగా సినిమాలు విడుదల చేద్దామనుకుంటే.. కరోనా అడ్డు పడింది. అసలు రాజకీయాలతో బిజీగా ఉన్న టైం లోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ ని పరిగెత్తించాడు. ఇక కరోనా తో అటు రాజీకీయాలు లేవు. ఇటు సినిమా షూటింగ్స్ లేవు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడానికి రెడీ గా ఉండడంతో మరో 20 నుండి 25 రోజులు షూటింగ్ మిగిలిఉన్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మళ్లీ వెంటనే పట్టాలెక్కి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది... థియేటర్స్ లో మొదటగా వచ్చే మూవీ వకీల్ సాబ్ అన్నారు.

కానీ తాజాగా పవన్ కళ్యాణ్ షూటింగ్ కి కొంత విరామం కావాలని దిల్ రాజు ని అడిగినట్లుగా.. ఇప్పటికే వేణు శ్రీరామ్ తో పవన్ మాట్లాడినట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొంచెం లేటుగా షూటింగ్ లో జాయిన్ అవుతానని చెప్పినట్లుగా ఫిలింనగర్ న్యూస్. జూన్ మొత్తం విరామం తీసుకుని జులై లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్స్ మీదకెళ్తాడట.. ఇక దిల్ రాజు కూడా హడావిడి ఏం లేదు.. ఎలాగూ వకీల్ సాబ్ ని దసరా కి తేవాలనే యోచనలో పవన్ అడిగిన వెంటనే ఓకె చెప్పేసాడని అంటున్నారు. సో వకీల్ సాబ్ ఇప్పట్లో లేనట్లే అన్నమాట.

Pawan Kalyan Takes One More Month for Rest:

Pawan Kalyan request to Vakeel Saab Producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ